ఒమన్‌లోని ఎంబసీలో ‘మహాత్మా గాంధీ 155వ జయంతి’ అహింసా దినోత్సవం..!!
- October 03, 2024
మస్కట్: రాజయోగ సెంటర్ ఫర్ సెల్ఫ్ డెవలప్‌మెంట్‌తో కలిసి మస్కట్‌లోని భారత రాయబార కార్యాలయం మహాత్మా గాంధీ 155వ జయంతి మరియు అంతర్జాతీయ అహింసా దినోత్సవాన్ని జరుపుకుంది. ఈ కార్యక్రమంలో ఒమానీ ప్రముఖులు, భారతీయులు, రెండు దేశాల విద్యార్థులు, రెసిడెంట్ రాయబారులు, దౌత్య దళ సభ్యులు, ప్రవాస భారతీయులతో సహా అన్ని రంగాలకు చెందిన వారు ఉత్సాహంగా పాల్గొన్నారు.సుల్తాన్ ఖబూస్ యూనివర్శిటీ నుండి 20 మంది విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. శాంతి సహనం గాంధేయ విలువలను యువతరం అర్థం చేసుకోవాలని వక్తలు సూచించారు. ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డు గ్రహీత, ఒమన్‌లో దీర్ఘకాల నివాసి అయిన మిస్టర్ కిరణ్ అషర్ మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడంతో వేడుక ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి హెచ్.హెచ్.సయ్యదా హుజైజా అల్ సైద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఒమన్ సుల్తానేట్‌లో భారత రాయబారి హెచ్‌ఇ అమిత్ నారంగ్ తన స్వాగత ప్రసంగంలో భారతీయ సాంస్కృతిక వారసత్వం గురించి, గాంధీజీ అహింస విధానాలను వివరించారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







