వావ్.! ఏమి కాన్ఫిడెన్స్ సుధీర్ బాబూ.!

- October 10, 2024 , by Maagulf
వావ్.! ఏమి కాన్ఫిడెన్స్ సుధీర్ బాబూ.!

సుధీర్ బాబు ఏం చేసినా అలాగే వుంటుంది మరి. కమర్షియల్ హంగులకు దూరంగా కంటెంట్ రిచ్ సినిమాలకు పెద్ద పీట వేసే హీరోల్లో సుధీర్ బాబు ముందు వరసలో వుంటాడు.
ఇటీవలే ‘హరోం హర’ అనే ఓ డిఫరెంట్ యాక్షన్ సినిమాతో వచ్చాడు. అలాగే ‘జటాధర’ అనే మరో యాక్షన్ పిలింలోనూ సుధీర్ బాబు నటిస్తున్నాడు.
ఈ శుక్రవారం తాజా తాజాగా ‘మా నాన్న సూపర్ హీరో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చేస్తున్నాడు సుధీర్ బాబు.
షియాజీ షిండే ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తండ్రి కోసం ఓ కొడుకు ఏం చేయడానికైనా సిద్ధమే. ఆఖరికి కొడుకు క్యాన్సర్ పేషెంట్ అని అబద్ధం చెప్పి అప్పులు చేసే తండ్రిని సమర్ధించడానికి నిజంగా తనకి క్యాన్సరే అని ఒప్పుకునే గొప్ప కొడుకు ఈ సినిమాలోని సుధీర్ బాబు పోషించే పాత్ర.
ట్రైలర్ చూస్తుంటే, కన్న తండ్రి ఒకరు, పెంచిన తండ్రి ఒకరు. పెంచిన తండ్రికే ఎక్కువగా సుధీర్ బాబు ప్రయారిటీ ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది. అయితే ఈ ఇద్దరు తండ్రుల ముద్దుల కొడుకు కథేంటో తెలియాలంటే ‘మా నాన్న సూపర్ హీరో’ సినిమా చూడాల్సిందే.
అయితే, రెండు రోజుల ముందే ఈ సినిమా ప్రీమియర్స్ వేస్తుండడంతో సినిమా కంటెంట్‌పై చిత్ర యూనిట్‌ ఎంత నమ్మకంగా వుందో అర్ధం చేసుకోవచ్చు. రెండు రోజులు ముందే.. అంటే టాక్ ఏమాత్రం తేడా వచ్చినా అంతే సంగతి. కానీ, కంటెంట్‌పై ఎంత నమ్మకముంటే చిత్ర యూనిట్ ఈ నిర్ణయం తీసుకుంటుంది.!

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com