బిగ్‌బాస్: కామెడీనే కాదండోయ్.! అవినాష్‌లో ఈ యాంగిల్ కూడా వుంది.!
- October 16, 2024
జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఓ మంచి కమెడియన్ అవినాష్. ఆ తర్వాత సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటూ కెరీర్ బాగానే నడిపిస్తున్నాడు.
గతంలో ఓ సీజన్ బిగ్‌బాస్‌లో అవినాష్ సందడి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రన్ అవుతున్న సీజన్ 8 బిగ్‌బాస్‌లో అవినాష్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లో ప్రవేశించాడు.
అయితే, గతంలో కేవలం కామెడీ, ఎంటర్టైన్మెంట్తో మాత్రమే ఆకట్టుకున్న అవినాష్ ఈ సీజన్లో తనలోని సీరియస్ మోడ్ కూడా ఆన్ చేశాడు.
నామినేషన్ల పర్వం అంటేనే సహజంగా హోరా హోరీ హాట్ హాట్‌గా నడుస్తుంది. ఈ పర్వంలో అవినాష్ రెచ్చిపోతున్నాడు. తాజా నామినేషన్లలో భాగంగా గౌతమ్‌పై తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు.
కామెడీ చేయడాన్ని కాస్త తక్కువ చేసి మాట్లాడిన గౌతమ్‌ని లెఫ్ట్ అండ్ రైట్ ఆడేసుకున్నాడు. అలాగే, మరో కంటెస్టెంట్ పృధ్వీని కూడా తన రేంజ్లో దుమ్ము దులిపేశాడు.
హౌస్‌లోకి రాక ముందు తాను కొన్ని ఎపిసోడ్లే చూశాననీ, బిజీ షెడ్యూల్స్ కారణంగా తన భార్య ఇచ్చిన ఇన్‌పుట్స్‌తో హౌస్ మేట్స్ అందరి మీదా ఓ అభిప్రాయం వుందని ఆ లెక్కల్లోనే తనకు నామినేషన్లపై ఓ అభిప్రాయం వుందనీ జన్యూన్‌గా అవినాష్ చెప్పాడు.
అయితే, నువ్వెందుకొచ్చావ్.. నీ భార్యనే పంపించొచ్చు కదా.. అని పృద్వీ పలికిన అసందర్భ వ్యాఖ్యలకు అవినాష్ బేస్ టోన్‌లో సమాధానమిచ్చాడు. అంతేకాదు, హౌస్ మేట్స్ అందరినీ వుద్దేశించి ఓ రౌండ్ వేసుకున్నాడు కూడా. అవినాష్లోని ఈ యాంగిల్ చూసి అంతా షాకవుతున్నారు. ఏది ఏమైతేనేం, ఈ సీజన్ బిగ్‌బాస్‌లో అవినాష్ నుంచి కొంత డిఫరెంట్ స్టఫ్ వస్తుండడాన్ని స్వాగతిస్తున్నారు ఆడియన్స్.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







