మరోసారి బాలయ్య అన్‌స్టాపబుల్‌కి సీఎం చంద్రబాబు

- October 19, 2024 , by Maagulf
మరోసారి బాలయ్య అన్‌స్టాపబుల్‌కి సీఎం చంద్రబాబు

ఆహా ఓటీటీలో వచ్చిన బాలకృష్ణ అన్‌స్టాపబుల్ మూడు సీజన్లు పూర్తిచేసుకొని ఇటీవలే నాలుగో సీజన్ ప్రకటించారు. నాలుగో సీజన్ ప్రోమో లాంచ్ చేసి గ్రాండ్ గా అనౌన్స్ చేసారు. దీంతో నాలుగో సీజన్ పై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. అలాగే అన్‌స్టాపబుల్ సీజన్ 4 అక్టోబర్ 24 నుంచి స్ట్రీమ్ కానున్నట్టు కూడా ప్రకటించారు. తాజాగా ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.

ఆహా అన్‌స్టాపబుల్ నాలుగో సీజన్ లో మొదటి ఎపిసోడ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో ఉండబోతున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన షూటింగ్ రేపు జరగనున్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ గతంలో చంద్రబాబు నాయుడు అన్‌స్టాపబుల్ షోకి లోకేష్ తో కలిసి వచ్చి సందడి చేసారు. ఇప్పుడు మరోసారి సీఎం అయ్యాక వస్తుండటంతో ఈ ఎపిసోడ్ పై అంచనాలు నెలకొన్నాయి.

బాలయ్య బాబు ఈసారి సీఎం చంద్రబాబు నాయుడుని ఎలాంటి ప్రశ్నలు అడుగుతాడు, ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు, చంద్రబాబుతో కలిసి బాలయ్య ఎలాంటి సరదా గేమ్స్ ఆడనున్నాడో అని బాలయ్య, టీడీపీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. అన్‌స్టాపబుల్ సీజన్ 4 లో మొదటి ఎపిసోడ్ సీఎం చంద్రబాబుతో వస్తుండటంతో ప్రేక్షకులు ఆహాలో ఈ షో కోసం ఎదురుచూస్తున్నారు. మీరు కూడా ఈ అదిరిపోయే అన్‌స్టాపబుల్ విత్ NBK షోని త్వరలోనే ఆహా ఓటీటీలో చూసేయండి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com