సౌదీ అరేబియాలో హోమ్ డెలివరీ కార్మికులకు కొత్త రూల్స్..!!

- October 20, 2024 , by Maagulf
సౌదీ అరేబియాలో హోమ్ డెలివరీ కార్మికులకు కొత్త రూల్స్..!!

రియాద్: సౌదీ అరేబియా మునిసిపాలిటీ, హౌసింగ్ మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన హోమ్ డెలివరీ సేవ కోసం డ్రాఫ్ట్ ప్రకారం.. హోమ్ డెలివరీ సేవలో పని చేసే వారికి ఇకపై యూనిఫాం తప్పనిసరి. కార్మికులు చేసే పనులకు సంబంధించిన యూనిఫామ్ ను తప్పనిసరిగా ధరించాలి. డెలివరీ సేవలో ఉన్నవారు చెల్లుబాటు అయ్యే మునిసిపల్ లైసెన్స్ కలిగి ఉండాలని, లేనివారు వెంటనే డెలివరీ అనుమతిని పొందాలని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అదేవిధంగా సేవలందించేందుకు వినియోగించే వాహనాల డేటా, కార్మికుల డేటాను జతచేయనున్నట్లు తెలిపారు. వాహనంపై  కంపెనీ పేరు, ట్రేడ్‌మార్క్ తప్పనిసరిగా ఉండాలి. వాహనం రిజిస్ట్రేషన్ లైసెన్స్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ రుజువులను ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. డెలివరీ సేవలను అందజేసే సమయంలో అవసరమైన నిబంధనలు పాటించాలి.   ఆహార ఉత్పత్తులను రవాణా చేసేటప్పుడు డెలివరీ సమయంలో అన్ని సమయాల్లో ఫేస్ మాస్క్, హ్యాండ్ గ్లోవ్స్ ధరించడం తప్పనిసరి.  నిర్దేశించిన పార్కింగ్ ప్రదేశాలలో డెలివరీ వర్కర్ వాహనాన్ని పార్కింగ్ చేయడాన్ని నిషేధించారు.  ఆహార రవాణా కార్మికులు ఆహార భద్రతపై విద్యా శిక్షణా కోర్సులను అభ్యసించాలని సిఫార్సు చేశారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com