యూఏఈలో ఫైర్ వర్క్స్, లేజర్ ప్రదర్శనలు: షార్జా, దుబాయ్‌లో అధికారిక అనుమతి పొందడం ఎలా?
- October 20, 2024
యూఏఈ: మీరు ఫైర్ వర్క్స్ పేల్చి ఈవెంట్‌ను ఘనంగా జరుపుకోవాలనుకుంటున్నారా? యూఏఈ అలా చేయడానికి మీకు లైసెన్స్ పొందిన సంస్థ నుండి అనుమతి పొందడం తప్పనిసరి. ఫెడరల్ డిక్రీ లా నం.17లో పేర్కొన్న విధంగా లైసెన్సింగ్ అథారిటీ అనుమతి లేకుండా బాణసంచా కాల్చితే కనీసం Dh50,000 జరిమానాతోపాటు జైలుశిక్ష విధిస్తారు. షార్జా , దుబాయ్‌లో బాణాసంచా అధికారిక అనుమతి పొందేందుకు వివరాలను అధికారులు తెలిపారు. ఈ రెండు ఎమిరేట్స్‌లలో,= సంబంధిత పౌర విమానయాన అధికారం నుండి ఈ ఈవెంట్‌లకు ఆమోదం పొందవచ్చు.
షార్జా
ఎమిరేట్‌లో బాణసంచా ప్రదర్శనను నిర్వహించడానికి, మీరు తప్పనిసరిగా షార్జా పౌర విమానయాన శాఖ నుండి అనుమతి పొందాలి. మీరు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, 'సేవలు'పై క్లిక్ చేయడం ద్వారా దరఖాస్తు చేయవచ్చు. అనంతరం 'నో అబ్జెక్షన్ లెటర్స్' సెక్షన్‌పై క్లిక్ చేసి ఫైర్ వర్క్స్ ఎంచుకోవాలి. కంపెనీ ట్రేడ్ లైసెన్స్, అధికారిక రిక్వెస్ట్ లేఖ, ఈవెంట్ వివరాలలు, జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ నుండి సెక్యూరిటీ క్లియరెన్స్ పత్రాలతో కలిసి దరఖాస్తు చేయాలి.
ఫీజులు: ప్రతి లావాదేవీకి Dh3,000, Dh10 - ప్రభుత్వ రుసుము.
దుబాయ్
ఎమిరేట్‌లో లేజర్ షో లేదా ఏదైనా విధమైన పైరోటెక్నిక్ డిస్‌ప్లే నిర్వహించడానికి, దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ నుండి అనుమతి తప్పనిసరిగా మంజూరు చేయబడాలి. వినోద రంగంలోని వ్యాపారాలు అధికార వెబ్‌సైట్‌లో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. DCAA వెబ్‌సైట్‌లో ఎగువన ఉన్న 'సర్వీసెస్'పై క్లిక్ చేసి, 'ఏవియేషన్ సేఫ్టీ ఆపరేషన్స్ కోసం జారీ అనుమతులు' ఎంచుకోవాలి. ఆ తర్వాత 'లేజర్ లేదా పైరోటెక్నిక్ డిస్‌ప్లేను నిర్వహించడానికి అభ్యంతరం లేని సర్టిఫికేట్ కోసం దరఖాస్తు' ఎంచుకోవాలి. ఆపై, ప్రారంభ సేవపై క్లిక్ చేసి, వెబ్‌సైట్, యూఏఈ పాస్, ఫేస్ బుక్ లేదా గూగుల్ లోని ఖాతా ద్వారా లాగిన్ అవ్వాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి, ఫీజు చెల్లించిన తర్వాత, తక్షణమే పర్మిట్ జారీ అవుతుంది.
ఫీజులు: ప్రతి లావాదేవీకి Dh2,000, Dh10 - నాలెడ్జ్ దిర్హమ్ ఫీజు (KDF), Dh10 - ఇన్నోవేషన్ ఫీజు.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు