ఒమన్ లో భారతీయ వ్యాపారవేత్తకు ఘనంగా నివాళులు..!!
- October 21, 2024
మస్కట్: సుర్ మార్కెట్లో ఇంటి గోడ కూలిన ఘటనలో మరణించిన భారతీయ వ్యాపారవేత్త పురుషోత్తమ్ భాటియా(89), అతని భార్య పద్మిని(85)లకు ఘరంగా నివాళులు అర్పిస్తున్నారు. ఈ జంట దశాబ్దాలుగా సూర్లో నివాసం ఉంటున్నారు. స్థానికులు 'వాల్ద్ హేరా' అని ముద్దుగా పిలుచుకునే పురుషోత్తమ్.. ప్రముఖ హీరానంద్ కిషందాస్ అండ్ కంపెనీని నడుపుతున్నారు. ఈ ప్రసిద్ధ వస్త్ర దుకాణం గత 70 సంవత్సరాలుగా సేవలందిస్తున్నది. విషాద వార్త వైరల్ కావడంతో.. అతని స్నేహితులు, బంధువులు, కస్టమర్లు ఆయన ఇంటి వద్ద నివాళులర్పిస్తున్నారు. ఈ ప్రాంతానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఇటీవలే సుర్ పర్యటన సందర్భంగా ఒమన్‌లోని భారత రాయబారి అమిత్ నారంగ్ ఆయనను సత్కరించారు. పురుషోత్తంకు కొడుకు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.
తాజా వార్తలు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స