ఏఐతో సత్వర న్యాయం.. యూఏఈలో తొలి వర్చువల్ లాయర్ ప్రాజెక్టు..!!

- October 21, 2024 , by Maagulf
ఏఐతో సత్వర న్యాయం.. యూఏఈలో తొలి వర్చువల్ లాయర్ ప్రాజెక్టు..!!

యూఏఈ: GITEX 2024 సందర్భంగా న్యాయ మంత్రిత్వ శాఖ సాధారణ కేసుల్లో న్యాయపరమైన వాదనలను అభివృద్ధి చేయడంలో చట్టపరమైన సంస్థలకు సహాయపడే 'వర్చువల్ లాయర్' ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. వర్చువల్ లాయర్ అనేది యూఏఈలో మొదటి ప్రాజెక్ట్. కేసు విచారణ సమయాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది.  వర్చువల్ న్యాయవాది న్యాయ మంత్రిత్వ శాఖ రూపొందించిన “యూనిఫైడ్ నేషనల్ లెజిస్లేటివ్ టెక్స్ట్స్ డేటాబేస్”ని ఉపయోగించి వాదనలు వినిపిస్తుంది. అయితే దీనిని ఉపయోగించాలనుకునే న్యాయ సంస్థలు వర్చువల్ లాయర్‌ను మంత్రిత్వ శాఖలో నమోదు చేసిన తర్వాత దాని డేటాబేస్‌ను ఉపయోగించుకునేందుకు అనుమతించనున్నారు. ట్రయల్ వెర్షన్ 2025లో ప్రారంభించబడుతుందని అధికార యంత్రాంగం వెల్లడించింది. మొదటి దశలో ఇది ఫీచర్‌లతో కూడిన సాధారణ కేసుల్లో న్యాయవాదులకు సహాయం చేయడానికి పరిమితం కానుంది. ముఖ్యంగా న్యాయమూర్తితో పరస్పర ఇంటరాక్షన్, వాయిస్‌ని టెక్స్ట్‌గా మార్చడం, మెమోరాండాలు, డాక్యుమెంట్స్ సమర్పించడం వంటి పనులకు పరిమితం చేయనున్నారు.  ఇది డిజిటల్, ఇంటరాక్టివ్ లిటిగేషన్ వాతావరణంలో సేవలను వేగవంతం చేయడంతోపాటు అధునాతన సాంకేతికత,  కృత్రిమ మేధస్సును ఉపయోగించుకోవడానికి నిర్దేశించారు.  యూఏఈ ప్రభుత్వంలోని ఆఫీస్ ఆఫ్ గవర్నమెంట్ డెవలప్‌మెంట్ అండ్ ఫ్యూచర్,  ఆఫీస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ఎకానమీ రిమోట్ వర్క్ అప్లికేషన్స్ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తున్నారని న్యాయ శాఖ మంత్రి అబ్దుల్లా సుల్తాన్ బిన్ అవద్ అల్ నుయిమి తెలిపారు.  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలు న్యాయ వ్యవస్థను అభివృద్ధి చేయడంలో కొత్త ఆవిష్కరణలు దోహదం చేస్తాయన్నారు. వర్చువల్ లాయర్ ప్రాజెక్ట్ న్యాయ వ్యవస్థపై పరిపాలనా భారాన్ని తగ్గించడానికి దోహదపడుతుందని తెలిపారు.  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ఎకానమీ రిమోట్ వర్క్ అప్లికేషన్స్ శాఖ సహాయ మంత్రి ఒమర్ సుల్తాన్ అల్ ఒలామా మాట్లాడుతూ.. వివిధ రంగాలలో కృత్రిమ మేధస్సు ద్వారా వేగవంతమైన పరిష్కారాలను అందించే లక్ష్యంతో కార్యక్రమాలను ఆవిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com