‘తండేల్’.! సంక్రాంతికి సెట్ అవుతుందా.!

- October 23, 2024 , by Maagulf
‘తండేల్’.! సంక్రాంతికి సెట్ అవుతుందా.!

ప్రతీ ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా సంక్రాంతి అందంగా ముస్తాబు కానుంది కొత్త సినిమాలతో. ఆల్రెడీ ‘గేమ్ ఛేంజర్’ సంక్రాంతి రేస్‌లో రెడీగా వుంది.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరియు శంకర్ కాంబో సినిమా కావడం ఓ ఎత్తయితే, దిల్ రాజు సినిమా కావడం మరో ఎత్తు ఈ సినిమాకి.

దిల్ రాజు సినిమాలు సంక్రాంతి సీజన్‌లో రిలీజ్ అవుతున్నాయంటే మరే ఇతర సినిమాలకీ ధియేటర్లు దొరకడం చాలా కష్టం.

అయితే, ఇదే సీజన్‌లో భారీ అంచనాలతో రాబోతున్నాడు అక్కినేని బుల్లోడు నాగ చైతన్య.. చైతూ నటించిన ‘తండేల్’ సినిమా వాస్తవానికి ఎప్పుడో విడుదల కావల్సిన సినిమా ఇది.

వాయిదాల పర్వంతో సంక్రాంతికి సెట్ అయ్యింది. ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ, సంక్రాంతికి సినిమా పక్కా అంటున్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో నాగ చైతన్యకు సాయి పల్లవి జోడీగా నటిస్తోంది.

సినిమా కంటెంట్‌పై ఇంతవరకూ వచ్చిన ప్రోమోలతో ఓ ఐడియా అయితే వుంది ఆడియన్స్‌లో. చందూ మొండేటి పైనా ఒకింత నమ్మకం వుంది.

సో అలా చూసుకుంటే, ఈ సినిమా సంక్రాంతి రేస్‌లో గట్టి పోటీ ఇవ్వడం ఖాయమే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com