రమదాన్‌ అలర్ట్‌: డయాబెటిక్‌ పిల్లలకు హెచ్‌ఎంసి సూచనలు

- June 25, 2016 , by Maagulf
రమదాన్‌ అలర్ట్‌: డయాబెటిక్‌ పిల్లలకు హెచ్‌ఎంసి సూచనలు

పవిత్ర రమదాన్‌ మాసంలో ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలు చేస్తుంటారు. వీరిలో పిల్లలు కూడా ఉంటారు. అయితే డయాబెటిస్‌తో బాధపడుతున్నవారు తగినన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే ఉపవాసం కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. పిల్లల్లోనూ, వృద్ధుల్లోనూ డయాబెటిస్‌ కారణంగా ఉపవాసం ప్రమాదకరంగా మారుతుంది. హమాద్‌ మెడికల్‌ కార్పొరేషన్‌, డయాబెటిక్‌ పిల్లలకు కొన్ని సూచనలు చేసింది. ఖచ్చితంగా డాక్టర్ల పర్యవేక్షణలో వారి సూచన మేరకు ఫాస్టింగ్‌ చేయడం పిల్లలకు ఉత్తమమని హెచ్‌ఎంసి వర్గాలు వివరించాయి. బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌లో హెచ్చు తగ్గుల్ని బట్టి, వారికి మందుల్ని డాక్టర్లు సూచించగలుగుతారనీ, ట్యాబ్లెట్లు వాడేవారికి ఒక విధంగా, ఇన్సులిన్‌ని వాడేవారికి ఇంకొకలా ఫాస్టింగ్‌ సూచనలుంటాయని హెచ్‌ఎంసి వర్గాలు తెలిపాయి. డాక్టర్‌ జయ్యోసి మాట్లాడుతూ, డయాబెటిక్‌ పిల్లలు గ్లుకాగోన్‌ లేదా గ్లూకోజ్‌ ఇంజెక్షన్‌ని ఎప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. అలాగే ఫాస్టింగ్‌ పూర్తి చేసిన తర్వాత కూడా చాలా జాగ్రత్తగా ఫుడ్‌ తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఫ్రైడ్‌ ఫుడ్స్‌, ఫ్యాటీ ఫుడ్స్‌, స్వీట్స్‌ని దూరంగా ఉంచడం ద్వారా రమదాన్‌ సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com