కార్మికులకు ఫ్రీ హెల్త్‌ చెక్స్‌, బహుమతులు

- June 25, 2016 , by Maagulf
కార్మికులకు ఫ్రీ హెల్త్‌ చెక్స్‌, బహుమతులు

వందలాది బ్లూ కాలర్‌ వర్కర్స్‌, ఫ్రీ మెడికల్‌ చెక్స్‌నీ, బహుమతుల్ని, అలాగే ఇఫ్తార్‌ మీల్స్‌ని అందుకున్నారు. శుక్రవారం అల్‌ ముహైస్నాలో పాకిస్తాన్‌ అసోసియేషన్‌ దుబాయ్‌ నిర్వహించిన హెల్త్‌ క్యాంప్‌లో ఈ బహుమతులు అందజేయబడ్డాయి. రమదాన్‌ మరియు మే డే సందర్భంగా ఈ క్యాంప్‌ నిర్వహించబడుతుంది. అతి తక్కువ జీతాలకు పనిచేస్తున్న కార్మికుల్ని ఉద్దేశించి ఈ క్యాంప్‌లను ప్రముఖ ఆసుపత్రులకు చెందిన వైద్యులతో ఏర్పాటు చేశారు. శుక్రవారం జరిగిన ఈ క్యాంప్‌ని పిఎడి మెడికిల్‌ వింగ్‌ నిర్వహించింది. అల్‌ ముహైస్నాలోని ట్రాన్స్‌గార్డ్‌ స్టాఫ్‌ హౌసింగ్‌ కాంప్లెక్స్‌లో నిర్వహించిన ఈ క్యాంప్‌కి కమ్యూనిటీ హెల్త్‌ అథారిటీ సహాయ సహకారాలు అందించింది. దుబాయ్‌ పోలీసులు ఈ సందర్భంగా 'వెల్‌ బీయింగ్‌'పై అవగాహనా కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. 10 మంది స్పెషలిస్టులు వివిధ ఆసుపత్రుల నుంచి వచ్చారని, బ్లడ్‌ షుగర్‌, కొలెస్టరాల్‌, బ్లడ్‌ ప్రెసర్‌ లెవల్స్‌ని పరీక్షించారని పిఎడి మెడికల్‌ వింగ్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ నిఘత్‌ అప్తాబ్‌ చెప్పారు. వెన్ను నొప్పి, జాయింట్‌ పెయిన్స్‌ వంటివి కూడా ఇక్కడ ప్రాధాన్యతాంశాలుగా ఉన్నాయి. అనేక ఆరోగ్య సమస్యలపై కార్మికులకు డాక్టర్లు వివరించారు, వారి సందేహాలకు సమాధానమిచ్చారు. మందుల్ని కూడా అందించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com