సౌదీ అరేబియాలో 22.8శాతం పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- November 25, 2024
రియాద్: సౌదీ అరేబియాలో చమురుయేతర ఎగుమతులు 22.8శాతం పెరిగాయి. ఈ మేరకు జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ (GASTAT) వెల్లడించింది. సెప్టెంబర్ 2024లో చమురుయేతర ఎగుమతుల్లో 22.8% పెరుగుదలను ప్రకటించింది. చమురుయేతర జాతీయ ఎగుమతులు రీ-ఎగుమతులు మినహా 11.6% పెరిగాయని, తిరిగి ఎగుమతి చేసిన వస్తువుల విలువ 65.4 పెరిగిందని తెలిపింది. సెప్టెంబర్లో కమోడిటీ ఎగుమతుల్లో 14.9% తగ్గుదలని సూచించగా, మొత్తం ఎగుమతులలో చమురు ఎగుమతుల శాతం సెప్టెంబర్ 2023లో 79.7% నుండి సెప్టెంబర్ 2024లో 70.7%కి తగ్గింది. సెప్టెంబర్ 2024లో సౌదీ అరేబియా దిగుమతులు 15% పెరిగాయన్నారు. సెప్టెంబర్ 2024లో చమురుయేతర వస్తువుల ఎగుమతుల శాతం 37.1%కి పెరిగినట్లు నివేదికలో తెలిపారు. ఇదే సమయంలో 15% దిగుమతుల పెరుగుదలతో పోలిస్తే చమురుయేతర ఎగుమతులు 22.8%కి చేరాయని అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







