విజిట్ వీసా టూ వర్క్ పర్మిట్.. నిషేధ చట్టాన్ని ఆమోదించిన బహ్రెయిన్ పార్లమెంట్..!!
- January 16, 2025
మనామా: కార్మిక మార్కెట్‌ను సంస్కరించే ఒక ముఖ్యమైన చర్యలో భాగంగా బహ్రెయిన్ పార్లమెంటు విజిట్ వీసాలను వర్క్ పర్మిట్‌లుగా మార్చడాన్ని నిషేధించే ముసాయిదా చట్టాన్ని ఆమోదించింది. 1965 ఏలియన్స్(వలస, నివాసం) చట్టాన్ని లక్ష్యంగా చేసుకుని, ఈ పద్ధతిని స్పష్టంగా నిషేధించే కొత్త ఆర్టికల్‌ను ప్రవేశపెట్టారు. దీంతోపాటు చట్టంలో ఏవైనా వ్యతరేక నిబంధనలను రద్దు చేసే నిబంధనలు ఉన్నాయి. దాని అమలు కోసం మార్గదర్శకాలను నిర్దేశిస్తారు.మొదట మే 2023లో ప్రవేశపెట్టిన ఈ ముసాయిదా చట్టం బహ్రెయిన్ జాతీయులకు ఉపాధి అవకాశాలకు ప్రాధాన్యత ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ప్రభుత్వ దీర్ఘకాలిక కార్మిక మార్కెట్ వ్యూహంతో రూపొందించారు. స్థానిక ఉపాధి అవకాశాలను బలోపేతం చేయడానికి, కొన్ని రంగాలలో విదేశీ కార్మికులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ఈ చట్టంలో కొన్ని నిబంధనలకు సవరణలు ప్రతిపాదించారు.లెజిస్టేటివ్ ప్రక్రియ ద్వారా ముసాయిదా చట్టం తుది ఆమోదం పొందగానే, వెంటనే అమల్లోకి వస్తుందని అధికార యంత్రాంగం వెల్లడించింది.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్‌లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









