160 దేశాల కార్మికుల కోసం 'ప్రొఫెషనల్ వెరిఫికేషన్' సర్వీస్..సౌదీ అరేబియా

- January 21, 2025 , by Maagulf
160 దేశాల కార్మికుల కోసం \'ప్రొఫెషనల్ వెరిఫికేషన్\' సర్వీస్..సౌదీ అరేబియా

రియాద్ : మానవ వనరులు,  సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ తన 'ప్రొఫెషనల్ వెరిఫికేషన్' సర్వీస్ చివరి దశను విజయవంతంగా పూర్తి చేసింది.  దీనిని 160 కార్మిక-ఎగుమతి దేశాలకు విస్తరించింది. ఇది 'ప్రొఫెషనల్ అక్రిడిటేషన్' కార్యక్రమం కింద విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకారంతో రాజ్యంలోకి ప్రవేశించే ప్రవాస కార్మికుల నైపుణ్య స్థాయిలను పెంపొందించే లక్ష్యంతో రూపొందించారు. ప్రవాస కార్మికులు రాజ్యానికి రాకముందే సౌదీ కార్మిక మార్కెట్‌కి అవసరమైన ప్రాక్టికల్ నైపుణ్యాలను కలిగి ఉండాలని కోరుతూ మంత్రుల మండలి నిర్ణయానికి అనుగుణంగా ఈ సేవను ప్రవేశపట్టిపెట్టినట్లు తెలిపారు.  'ప్రొఫెషనల్ అక్రిడిటేషన్' కోసం సౌదీ స్టాండర్డ్ క్లాసిఫికేషన్ ఆఫ్ అక్యుపేషన్స్, సౌదీ యూనిఫైడ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ లెవెల్స్,  స్పెషలైజేషన్ వంటి స్థాపించబడిన ప్రమాణాలను సాధించాల్సి ఉంటుంది. వృత్తిపరమైన ధృవీకరణ అమలు కోసం మంత్రిత్వ శాఖ 1,007 వృత్తులను కవర్ చేస్తుందని అధికారులు తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com