దంత సంరక్షణ ఇలా
- July 09, 2015
దంత సమస్యలు చాలా సాధారణం అయిపోయాయి. మారుతున్న ఆహారపు అలవాట్లు దంత సమస్యలకు ప్రధాన కారణం అని చెప్తారు డాక్టర్లు. ఏ రకమైన టూత్ పేస్ట్‌ని వాడినా, దాన్ని వినియోగించే తీరు సరిగ్గా ఉంటేనే దంత సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు. రోజూ ఉదయం, సాయంత్రం బ్రష్ చేసుకోవడం ఉత్తమం. ఎలాంటి సమస్యలు కనిపించినా వెంటనే డాక్టర్‌ని కలవడం మంచిది. దంత సమస్యల విషయంలో అజాగ్రత్త మంచిది కాదు. దంతాల మూలల నుంచి రక్తం కారుతోంటే, అది అనేక ఇతర సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. పిప్పి పళ్ళను ట్రీట్ చేసేందుకు ఆధునిక వైద్య చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి. పంటి నొప్పితో బాధపడేవారు వంటింట్లో నిత్యం ఉండే లవంగాను బుగ్గన ఉంచుకోవడం ద్వారా కొంత ఉపశమనం పొందవచ్చు. నోటి దుర్వాసనను కూడా దూరం చేస్తుందది. హడావిడిగా కాకుండా తగిన సమయం బ్రష్ చేసుకోవడానికి కేటాయించాలి. అలా చేస్తేనే సరిగ్గా బ్రష్ చేసినట్లవుతుంది. ఏదయినా తిన్న వెంటనే పండ్లలోకి ఆహార పదార్థాలు ఇరుక్కుపోయే అవకాశం ఉన్నందున, వీలైనంతవరకు తిన్న తర్వాత నీళ్ళతో నోటిని పుక్కళించుకోవాలి.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







