కువైట్ జాతీయ దినోత్సవ వేడుకలు..భారీ భద్రత..తనిఖీలు..!!
- February 10, 2025
కువైట్: రాబోయే జాతీయ వేడుకల కోసం భద్రతా ప్రణాళికను అధికారులు ఖరారు చేశారు. చట్టాన్ని గౌరవిస్తూ ఉత్సవాలను ఆస్వాదించాలని పౌరులు, నివాసితులను కోరారు. ఖైరాన్, వఫ్రా, కబ్ద్, సుబియా, జాబర్ బ్రిడ్జ్, అబ్దాలీ ఫామ్స్, అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ వంటి ప్రదేశాలలో భారీ భద్రతా చర్యలను తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎవరైనా ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తే.. వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. వేడుకల సందర్భంగా 8000 మంది పోలీసులతో పాటు 900 పెట్రోలింగ్ వాహనాలను భద్రతా కోసం వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఇప్పటికే వేడకలను పురస్కరించుకొని కఠిన నిర్ణయాలను ప్రకటించారు. నీరు, నురుగు లేదా ఇతర పదార్థాలను స్ప్రే చేయడంపై నిషేధం విధించారు. నిబంధనలు ఉల్లంఘించినవారి వాహనాన్ని స్వాధీనం చేసుకోవడంతోపాటు భారీ జరిమానా, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







