నకిలీ ట్రాఫిక్ జరిమానాలు.. క్లిక్ చేసారో సెకన్లలో బాధితుల అకౌంట్లు ఖాళీ..!!

- February 28, 2025 , by Maagulf
నకిలీ ట్రాఫిక్ జరిమానాలు.. క్లిక్ చేసారో సెకన్లలో బాధితుల అకౌంట్లు ఖాళీ..!!

మనామా: ఇటీవల ఆర్థిక మోసాలు బహ్రెయిన్‌లో అధికమయ్యాయి. సైబర్ మోసగాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బును దోచేస్తున్నారు. అనేక అవగాహన ప్రచారాలు నిర్వహిస్తున్నప్పటికీ, స్కామ్ వ్యూహాలు మారుతునే ఉన్నాయి.  గత వారం ట్రాఫిక్ జరిమానా నోటిఫికేషన్ వలె వచ్చిన ఫిషింగ్ స్కామ్‌కు ఇటీవల బలి ఓ వ్యక్తి బలయ్యాడు. నిందితులు అధికారిక బహ్రెయిన్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ పేమెంట్ గేట్‌వేని పోలి ఉండే నకిలీ వెబ్‌సైట్‌కి మళ్లించి మోసపోయారు.  “వెబ్‌సైట్ చాలా అసలైనదిగా కనిపించినందున ఇది స్కామ్ అని నేను ఎప్పుడూ అనుమానించలేదు. నాకు BD 20 జరిమానా ఉందని నేను భావించాను. దానిని వెంటనే చెల్లించాలని నిర్ణయించుకున్నాను.  ”అని బాధితుడు అన్నారు.

అతను తన క్రెడిట్ కార్డ్ వివరాలు, CPR నంబర్, పూర్తి పేరును నమోదు చేశాడు. ప్రారంభంలో, అతని ఖాతా నుండి BD 20 మైనస్ అయింది. కొన్ని సెకన్లలో అతని అకౌంట్ నుండి AUD 4,000, AUD 2,000,  AUD 1,000 చొప్పున కట్ అయినట్లు SMS నోటిఫికేషన్‌లను అందుకున్నాడు. “నా కార్డ్‌ని బ్లాక్ చేయడానికి నేను వెంటనే నా బ్యాంక్‌కి కాల్ చేసాను. కానీ అప్పటికి లావాదేవీలు పూర్తయ్యాయి. ఇప్పుడు, దొంగిలించబడిన మొత్తానికి వడ్డీ చెల్లించడమే నా వంతయింది, ”అని వాపోయాడు. 

బహ్రెయిన్‌లోని నివాసితులను వేధిస్తున్న అనేక మోసాలలో ఒకటి.  అదే సమయంలో రమదాన ఛారిటీ పేరిట మోసగాళ్లు సోషల్‌ మీడియాలో నకిలీ వాటర్‌ బాటిల్‌ డొనేషన్‌ ఆఫర్‌లంటూ ఫేక్ ప్రచారం చేస్తున్నారు.  ఇది నమ్మిన  ఓ బాధితుడు BD 2,000, మరొకరు BD 4,000 కోల్పోయారని సైబర్ సెక్యూరిటీ నిపుణుడు అలీ బెషారా చెప్పారు. నకిలీ వివాహ అవకాశాలకు సంబంధించి జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ యాంటీ కరప్షన్, ఎకనామిక్ & ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ (ACEES) ఇటీవల పబ్లిక్ నోటీసును జారీ చేసింది. ఆకర్షణీయమైన మహిళల వీడియోలను చూపించి, ప్రోత్సాహకాలుగా పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తామని హామీ ఇచ్చి మోసగాళ్లు బాధితులను మోసగిస్తారని పేర్కొన్నారు. అలాగే ఇటీవల తక్కువ పనికి అధిక జీతాలు ఇస్తామని హామీ ఇచ్చే నకిలీ ఉద్యోగ ఆఫర్‌లు కలకలం రేపుతున్నాయని, ఇలాంటి ఫేక్ అడ్వర్టైజ్ మెంట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరారు. అనుమానాస్పద కార్యకలాపాలను సంబంధిత అధికారులకు నివేదించాలని సూచించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com