జూలై 3 నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం..

- March 05, 2025 , by Maagulf
జూలై 3 నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం..

అమర్‌నాథ్ పుణ్యక్షేత్ర బోర్డు..అమర్నాథ్ యాత్ర తేదీలను ఖరారు చేసింది. జమ్ముకశ్మీర్‌లోని పవిత్రమైన అమర్నాథ్ గుహకు వార్షిక తీర్థయాత్ర జూలై 3, 2025న ప్రారంభం కానుంది. 39 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుంది. రక్షా బంధన్ రోజున(ఆగస్ట్ 9) ముగుస్తుంది. అమర్‌నాథ్ పుణ్యక్షేత్ర బోర్డు ఛైర్మన్‌ జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధ్యక్షత వహించిన పుణ్యక్షేత్ర బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తేదీలు నిర్ణయించడంతో తీర్థయాత్రకు సజావుగా ఏర్పాట్లు జరిగేలా చూసుకోవడంపై అధికారులు దృష్టి సారించారు.

అమర్‌నాథ్ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. పవిత్ర మందిరం సందర్శనకు పెద్ద సంఖ్యలో భక్తులకు తరలి వస్తారు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం సులభంగా అయ్యేలా అధికారులు ఏర్పాట్లు చేస్తారు. అలాగే భక్తులకు భద్రత, వైద్య సదుపాయాలు కల్పిస్తారు.

అమర్‌నాథ్ యాత్ర అత్యంత పవిత్రమైన హిందూ తీర్థయాత్రలలో ఒకటి. ఇది దేశవ్యాప్తంగా భక్తులను ఆకర్షిస్తుంది. అమర్‌నాథ్ గుహ లోపల సహజంగా ఏర్పడిన మంచు శివలింగం ఆశీర్వాదం కోసం యాత్రికులు హిమాలయ భూభాగం నుంచి ట్రెక్కింగ్‌ చేపడతారు. ఇది సవాళ్లతో కూడుకున్న యాత్ర. ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర రెండు మార్గాలు అనంతనాగ్ జిల్లా పహల్‌గామ్ ట్రాక్, గందర్‌బల్ జిల్లా బల్తల్ నుంచి ఒకేసారి జూలై 3న ప్రారంభం అవుతుంది

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com