'కిస్ కిస్ కిస్సిక్' గా మార్చి 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్
- March 08, 2025మచ్ అవైటెడ్ హిందీ ఎంటర్‌టైనర్ 'పింటు కి పప్పీ' మార్చి 21న హిందీ వెర్షన్‌తో పాటు తెలుగు, తమిళం, మలయాళం కన్నడ భాషలలో "కిస్ కిస్ కిస్సిక్" గా విడుదల కానుంది.
ప్రతిష్టాత్మక మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో గ్రాండ్ రిలీజ్ చేయనుంది. ఈ చిత్రం ట్రైలర్ మార్చి 8న విడుదల కానుంది.
లవ్, కామెడీ, యాక్షన్‌తో కంప్లీట్ ఎంటర్‌టైనర్ ఇది. ఈ చిత్రం పింటు అనే తుంటరి కుర్రాడి ప్రేమ, జీవితంలోని ఊహించని మలుపులను నావిగేట్ చేస్తూ హిలేరియస్ ఎంటర్ టైనర్ గా వుండబోతోంది. ఎమోషన్, నవ్వులు, సర్ ప్రైజ్ లతో రోలర్‌కోస్టర్ గా ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.
నిర్మాత విధి ఆచార్య తన ఉత్సాహాన్ని తెలియజేస్తూ"'పింటు కి పప్పీ' గురించి మేము చాలా గర్వపడుతున్నాము. ఇది అద్భుతమైన తారాగణం, టీంని ఒకచోట చేర్చింది మేము సృష్టించిన మాయాజాలాన్ని ప్రేక్షకులు ఎక్స పీరియన్స్ చేయడానికి ఎదురుచూస్తున్నాం" అన్నారు.
ఈ చిత్రం శుశాంత్, జాన్యా జోషి ,విధిని పరిచయం చేస్తుంది, వీరితో పాటు విజయ్ రాజ్, మురళీ శర్మ, సునీల్ పాల్, అలీ అస్గర్, అజయ్ జాదవ్, పూజా బెనర్జీ, అదితి సన్వాల్, రియా ఎస్. సోని, ఊర్వశి చౌహాన్, ప్యుమోరి మెహతా దాస్, ముక్తేశ్వర్ ఓజా, గణేష్ ఆచార్య వంటి కీలక తారాగణం కూడా ఉంది.
విధి ఆచార్య (V2S ప్రొడక్షన్) నిర్మించి, శివ్ హరే రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 21, 2025న గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధంగా ఉంది.
తాజా వార్తలు
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్‌టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్