ఐపీఎల్ మ్యాచ్లకు వెళ్ళేవాళ్ళకి గుడ్న్యూస్..
- March 16, 2025
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) సందడి షురూ అయింది. ఈనెల 22 నుంచి ఐపీఎల్ టోర్నీ ప్రారంభం కానుంది. కోల్ కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.ఇప్పటికే కొన్ని మ్యాచ్ లకు సంబంధించి టికెట్ల బుకింగ్ సైతం పూర్తయింది.ఈ క్రమంలో మైదానంలో మ్యాచ్ ను చూసేందుకు వెళ్లేవారికి సీఎస్కే జట్టు యాజమాన్యం గుడ్ న్యూస్ చెప్పింది.
ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ వీక్షించేందుకు మైదానంకు వెళ్లేవారికోసం చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (సీఎంఆర్ఎల్) కీలక నిర్ణయం తీసుకుంది. ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనున్న మ్యాచ్ లను తిలకించేందుకు వెళ్లేవారు.. వారు ఉంటున్న ప్రాంతానికి సమీపంలోని మెట్రో స్టేషన్ నుంచి గవర్నమెంట్ ఎస్టేట్ స్టేషన్ వరకు రానూపోను మెట్రో రైలు సేవలు ఉచితంగా వినియోగించుకోవచ్చు. అయితే, తప్పనిసరిగా ఐపీఎల్ మ్యాచ్ టికెట్ కలిగి ఉండాలి. ఈ మేరకు చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (సీఎంఆర్ఎల్), చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) యాజమాన్యంతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
మ్యాచ్ జరిగేరోజు ఆ మ్యాచ్ కు సంబంధించిన టికెట్ తో మెట్రోలో ఎంఏ చిదంబరం స్టేడియంకు వెళ్లొచ్చు. మ్యాచ్ ముగిసిన తరువాత 90 నిమిషాలు లేదా అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయి. అంతేకాదు.. సీఎస్కే మేనేజింగ్ డైరెక్టర్ కేఎస్ విశ్వనాథన్ మాట్లాడుతూ.. క్రికెట్ అభిమానులు మ్యాచ్ ప్రారంభం కావడానికి మూడు గంటల ముందుగా నాన్ ఏసీ ఎంటీసీ (మెట్రోపాలిటన్ ట్రాన్స్ ఫోర్ట్ కార్పొరేషన్) బస్సుల్లో తమ వద్ద ఉన్న క్రికెట్ మ్యాచ్ టికెట్ తో ఉచితంగా ప్రయాణం చేయవచ్చునని తెలిపారు. ఈ మేరకు చెన్నై చేపాక్ లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనున్న క్రికెట్ మ్యాచ్ కు ఎంటీసీ తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్