DH35 మిలియన్లు పలికిన DD5 నంబర్ ప్లేట్..!!
- March 16, 2025
దుబాయ్: శనివారం సాయంత్రం దుబాయ్‌లో జరిగిన ‘మోస్ట్ నోబుల్ నంబర్’ వేలంలో DD5 నంబర్ ప్లేట్ DH35 మిలియన్లకు అమ్ముడైంది. Dh15 మిలియన్ల బేస్ ధరతో వేలంపాట ప్రారంభమైంది. ఈ ప్లేట్‌ను దక్కించుకునేందుకు 20 మందికి పైగా వేలంలో పాల్గొన్నారు. చివరకు బింఘట్టి హోల్డింగ్ చైర్మన్ ముహమ్మద్ బింఘట్టి దీనిని దక్కించుకున్నారు. హాల్లోని అతి పిన్న వయస్కుడైన బిడ్డర్లలో ఒకరైన 13 ఏళ్ల అబ్దుల్‌ఖాదర్ వాలిద్ అసద్ మరో నంబర్ ప్లేట్ DD24 ను Dh6.3 మిలియన్లు చెల్లించి సొంతం చేసుకున్నాడు
పవిత్ర రమదాన్ మాసంలో మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ గ్లోబల్ ఇనిషియేటివ్స్ (MBRGI) కోసం డబ్బును సేకరించడానికి వార్షిక వేలం నిర్వహించారు. బుర్జ్ ఖలీఫాలోని అర్మానీ దుబాయ్ హోటల్లో 25 విశిష్ట మొబైల్ నంబర్లు, వాహన నంబర్ ప్లేట్లను వేలం వేశారు. మొత్తం Dh83,677,000 సేకరించినట్లు నిర్వాహకులు తెలిపారు.
వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రారంభించిన ఫాదర్స్ ఎండోమెంట్ ప్రచారానికి మద్దతుగా అందజేస్తారు. ఇది పేదలకు చికిత్స, ఆరోగ్య సంరక్షణ అందించడానికి స్థిరమైన ఎండోమెంట్ నిధిని ఏర్పాటు చేస్తుంది.
2023లో ఇదే కార్యక్రమంలో ఒక బిడ్డర్ P7 నంబర్‌ను Dh55 మిలియన్లకు కొనుగోలు చేయడం ద్వారా ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇది ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్లలో ఒకటిగా భావిస్తున్నారు.
అదే విధంగా DD77 నంబర్ ప్లేట్ Dh12.6 మిలియన్లకు అమ్ముడైంది. DD12 ప్లేట్ Dh12.8 మిలియన్లకు అమ్ముడైంది. DD15 నెంబర్ ప్లేట్ Dh9.2 మిలియన్లు పలికింది. ఈ కార్యక్రమంలో 058444444 మొబైల్ నంబర్ Dh1.7 మిలియన్లకు అమ్ముడైంది. RTA ప్లేట్ నంబర్ల ద్వారా Dh75.9 మిలియన్లు సంపాదించగా, Etisalat యూఏఈ మొబైల్ నంబర్లను విక్రయించడం ద్వారా Dh4.732 మిలియన్లు, du మొబైల్ Dh3.045 మిలియన్లు సేకరించింది.
అబుదాబిలోని మునిసిపాలిటీలు, రవాణా శాఖ కింద పనిచేసే ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ సెంటర్ (అబుదాబి మొబిలిటీ) నిర్వహించిన ఇది 444 ప్రత్యేక ప్లేట్ నంబర్లను కలిగి ఉంది. మార్చి 16, 17 తేదీలలో ముగుస్తుంది. ఈ నంబర్లలో వెహికల్ ప్లేట్ నంబర్లు 10 (ప్లేట్ కోడ్ 20), 99 (ప్లేట్ కోడ్ 2) ఉన్నాయి. మోటార్ సైకిల్ ప్లేట్ నంబర్ 5 (ప్లేట్ కోడ్ 1); అలాగే క్లాసిక్ కార్ల కోసం అనేక ప్రత్యేక ప్లేట్ నంబర్లు ఉంటాయి. నివాసితులు ఎమిరేట్స్ వేలం యాప్ ద్వారా అబుదాబిలో ఆన్లైన్ ఛారిటీ వేలంలో పాల్గొనవచ్చు.
తాజా వార్తలు
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్‌టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్