భారత్‌ సుంకాలు తగ్గిస్తుందనుకుంటున్నా‌: ప్రెసిడెంట్ ట్రంప్‌

- March 20, 2025 , by Maagulf
భారత్‌ సుంకాలు తగ్గిస్తుందనుకుంటున్నా‌: ప్రెసిడెంట్ ట్రంప్‌

అమెరికా: అమెరికా వస్తువుల పై భారత్‌ విధించే సుంకాల పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా స్పందించారు. గతంలో ఓ సందర్భంలో ట్రంప్ మాట్లాడుతూ భారత్‌ పన్నులు తగ్గించేందుకు అంగీకరించిందని.. అదంతా తన ఘనతే అని చెప్పిన  విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు మాత్రం తమ వస్తువులపై విధించే వాణిజ్య సుంకాలను న్యూ ఢిల్లీ తగ్గిస్తుందని విశ్వసిస్తున్నట్లు చెప్పారు.

తాజాగా ఆయన బ్రెయిట్‌బార్ట్‌ న్యూస్‌తో ట్రంప్‌ మాట్లాడుతూ.. ‘నాకు భారత్‌తో మంచి సంబంధం ఉంది. కానీ ఏకైక సమస్య ఏంటంటే.. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్‌ ఒకటి. భారత్‌ టారిఫ్‌లను గణనీయంగా తగ్గించే అవకాశం ఉన్నట్లు నేను నమ్ముతున్నాను. కానీ, ఏప్రిల్‌ 2 నుంచి వారెంత విధిస్తే.. మేమూ అంతే వసూలు చేస్తాం’ అని ట్రంప్‌ అన్నారు.

అమెరికాకు ఎలాంటి హామీ ఇవ్వలేదు: భారత్‌

కాగా, అమెరికా ఉత్పత్తులపై సుంకాల తగ్గింపునకు ఆ దేశానికి భారత్‌ ఎలాంటి హామీ ఇవ్వలేదని కేంద్ర వాణిజ్య కార్యదర్శి సునీల్‌ బార్తాల్‌ పార్లమెంటరీ ప్యానెల్‌కు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ‘టారిఫ్‌లను తగ్గించడానికి భారత్‌ అంగీకరించింది’ అంటూ ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన ప్రకటనపై ఆయన పార్లమెంటరీ కమిటీకి వివరణ ఇచ్చారు.  సుంకాల  విషయంపై ఇరు దేశాల మధ్య ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని, ఆ దేశానికి ఎలాంటి హామీ ఇవ్వలేదని ఆయన తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com