స్కూల్స్ టైమింగ్స్ మార్పు వల్ల ట్రాఫిక్ తగ్గుతుందా?

- March 25, 2025 , by Maagulf
స్కూల్స్ టైమింగ్స్ మార్పు వల్ల ట్రాఫిక్ తగ్గుతుందా?

యూఏఈ: దుబాయ్ లో ట్రాఫిక్ కష్టాలు వాహనదారులను వెంటాడుతున్నాయి. అదే సమయంలో ఆఫీసుల సమయాల్లో మార్పులు కూడా పేరెంట్స్ పై అదనపు ఒత్తిడిని కలిగిస్తోంది.  ముఖ్యంగా పాఠశాల సమయాల్లో ట్రాఫిక్ పెరుగుదల, తీవ్రమైన రద్దీ నేపథ్యంలో ఈ సమస్యలపై చర్చ జరుగుతుంది  మరోవైపు దుబాయ్ లో వాహనాల వృద్ధి రేటు 8 శాతం దాటింది. ఇది ప్రపంచ సగటు 2 శాతం కంటే ఎక్కువ.  

దుబాయ్‌లోని బ్లూమ్ వరల్డ్ అకాడమీ సౌకర్యవంతమైన పాఠశాల షెడ్యూల్‌ను అమలు చేస్తుంది. ఎమిరేట్స్‌లో ఉదయం 9 గంటల ప్రారంభ సమయాన్ని అమలు చేసిన మొట్టమొదటి పాఠశాలలలో ఇది ఒకటి. ఇది విద్యార్థుల లెర్నింగ్ తోపాటు కుటుంబ జీవితంతో బ్యాలెన్స్ చేయడంలో ఈ విధానం సహాయపడుతుందని బ్లూమ్ వరల్డ్ అకాడమీ వ్యవస్థాపక ప్రిన్సిపాల్ జాన్ బెల్ తెలిపారు.   

ప్రస్తుత ట్రాఫిక్ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని.. స్కూళ్ల ప్రారంభ సమయాలపై ఏటా సమీక్షించాలని GEMS ఫౌండర్స్ స్కూల్ - అల్ మిజార్ ప్రిన్సిపాల్/సీఈఓ అక్రమ్ తారిక్ అభిప్రాయపడ్డారు. తాము తల్లిదండ్రులు, విద్యార్థుల నుండి వచ్చిన అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు.     

అయితే, తల్లిదండ్రులు ఈ సమస్యపై భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొందరు దీనిపై సానుకూలంగా స్పందించగా,  మరికొందరు ఇది వారి పని షెడ్యూల్‌లను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని, వారి దైనందిన దినచర్యలకు అంతరాయం కలిగిస్తుందని ఆందోళన చెందుతున్నారు. అరిజిత్ నంది అనే భారతీయ ప్రవాసుడు పేరెంట్ మాట్లాడుతూ.. "పాఠశాల ప్రారంభ సమయాలను తరచూ మార్పు చేయడం ద్వారా తల్లిదండ్రుల ఉదయం దినచర్య గణనీయంగా మెరుగుపడుతుంది. ఒత్తిడిని తగ్గించడంతోపాటు రద్దీని తగ్గిస్తుంది. సజావుగా డ్రాప్-ఆఫ్ అవకాశాన్ని అందిస్తుంది. ట్రాఫిక్‌లో చిక్కుకునే బదులు, తల్లిదండ్రులు ఆ సమయాన్ని వేరే చోట ఉపయోగించుకోవచ్చు." అని అన్నారు. సిగ్నల్స్ వద్ద భారీ రద్దీ, కార్లు ముందుకు సాగకపోవడం కారణంగా మినిమం 30 నిమిషాలు వృధా అవుతుందని వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com