దుబాయ్‌లో నెలవారీ పార్కింగ్ సబ్‌స్క్రిప్షన్‌ను ప్రకటించిన పార్కిన్..!!

- May 20, 2025 , by Maagulf
దుబాయ్‌లో నెలవారీ పార్కింగ్ సబ్‌స్క్రిప్షన్‌ను ప్రకటించిన పార్కిన్..!!

యూఏఈ: దుబాయ్ లో పార్కిన్ కంపెనీ నగరం అంతటా నియమిత ప్రాంతాలలో నెలవారీ సబ్‌స్క్రిప్షన్ సేవలను ప్రారంభించింది. ఇది పార్కింగ్ సమయాన్ని ట్రాక్ చేయడం లేదా ఎక్కువ సమయం గడిపినందుకు జరిమానాలు విధించే ఇబ్బందులను తొలగిస్తుందని పేర్కొన్నారు. వాహనదారులు మొబైల్ అప్లికేషన్ లేదా పార్కిన్ వెబ్‌సైట్ ద్వారా సేవను రిజిస్ట్రర్ చేసుకోవచ్చు. నివాసితులకు కొత్త సబ్‌స్క్రిప్షన్ సేవలు అందుబాటులో ఉన్న ప్రాంతాలు క్రింద ఉన్నాయి:

దుబాయ్ హిల్స్ పబ్లిక్ పార్కింగ్ (631G): తేలికపాటి వాహనాల యజమానులు సబ్‌స్క్రయిబ్ చేసుకోవచ్చు. ఒక వాహనాన్ని మాత్రమే లింక్ చేయవచ్చు.

వ్యవధి:
1 నెల: Dh500
3 నెలలు: Dh1,400
6 నెలలు: Dh2,500
12 నెలలు: Dh4,500

సిలికాన్ ఒయాసిస్, జోన్ (H)
వ్యవధి:
3 నెలలు: Dh1,400
6 నెలలు: Dh2,500
12 నెలలు: Dh4,500

సిలికాన్ ఒయాసిస్ – లిమిటెడ్ ఏరియా: సబ్‌స్క్రిప్షన్ కొనుగోలు చేసేటప్పుడు మీరు 5% VAT చెల్లించాలి. మీ సబ్‌స్క్రిప్షన్ ప్యాకేజీకి ఒక వాహనాన్ని మాత్రమే లింక్ చేయవచ్చు.

వ్యవధి:
3 నెలలు: Dh1,000
6 నెలలు: Dh1,500
12 నెలలు: Dh2,500

Wasl కమ్యూనిటీలు (జోన్ W & WP): ఈ సబ్‌స్క్రిప్షన్ దుబాయ్ Wasl రియల్ ఎస్టేట్ పబ్లిక్ పార్కింగ్ (W, WP)కి మాత్రమే చెల్లుబాటు అవుతుంది. జారీ చేసిన తేదీ నుండి 48 గంటలలోపు సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేసుకుంటేనే వాహనదారులు రీఫండ్ పొందగలరు. మీరు ఈ సబ్‌స్క్రిప్షన్‌కు ఒక వాహనాన్ని మాత్రమే లింక్ చేయవచ్చు.

వ్యవధి:
1 నెల: Dh300
3 నెలలు: Dh800
6 నెలలు: Dh1,600
12 నెలలు: Dh2,800

రోడ్ సైడ్ అండ్ ప్లాట్ పార్కింగ్ (జోన్ A, B, C, D): A మరియు C కోడ్‌లతో రోడ్‌సైడ్ పార్కింగ్ .. B, D కోడ్‌లతో ప్లాట్ పార్కింగ్ కోసం మాత్రమే సబ్‌స్క్రిప్షన్ చెల్లుతుంది. రోడ్‌సైడ్ పార్కింగ్‌లో గరిష్టంగా నాలుగు గంటలు.  ప్లాట్ పార్కింగ్‌లో వరుసగా 24 గంటలు పార్కింగ్ అనుమతిస్తారు. 

వ్యవధి:
1 నెల = Dh500
3 నెలలు = Dh1,400
6 నెలలు = Dh2,500
12 నెలలు = Dh4,500

పార్కింగ్ ప్లాట్‌లకు మాత్రమే (జోన్ B, D): B , D కోడ్‌లతో పార్కింగ్ ప్లాట్‌లకు మాత్రమే సబ్‌స్క్రిప్షన్ చెల్లుతుంది. ఈ జోన్‌లలో గరిష్టంగా 24 గంటలు పార్కింగ్ అనుమతించబడుతుంది.

వ్యవధి:
1 నెల: Dh250
3 నెలలు: Dh700
6 నెలలు: Dh1,300
12 నెలలు: Dh2,400

పార్కిన్ వేరియబుల్ పార్కింగ్ రేట్లు
ఏప్రిల్‌లో పార్కిన్ దుబాయ్ అంతటా కొత్త వేరియబుల్ పార్కింగ్ టారిఫ్‌లను ప్రకటించింది. సవరించిన టారిఫ్ ప్రకారం.. వారాంతాలు, ప్రభుత్వ సెలవు దినాలు మినహా అన్ని జోన్‌లలో ఉదయం 8 నుండి 10 గంటల వరకు.. సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల మధ్య ప్రీమియం పబ్లిక్ పార్కింగ్ స్పాట్‌లకు గంటకు Dh6 ఖర్చవుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com