సౌదీ వ్యాపారవేత్తలతో కిర్గిజ్ అధ్యక్షుడు భేటీ..!!
- May 23, 2025
బిష్కెక్: కిర్గిజ్ అధ్యక్షుడు సదిర్ జపరోవ్.. కిర్గిజ్ రాజధాని బిష్కెక్‌లోని అధ్యక్ష కార్యాలయంలో సౌదీ ఛాంబర్స్ సమాఖ్య (FSC) చైర్మన్ హసన్ అల్వైజీ, సౌదీ పెట్టుబడిదారులు ప్రభుత్వ ప్రతినిధుల బృందంతో భేటీ అయ్యారు. అంతకుముందు FSC ప్రతినిధి బృందం కిర్గిజ్స్తాన్‌లో రెండు రోజులపాటు పర్యటించింది. ఈ సందర్భంగా ఆర్థిక, పెట్టుబడి వాతావరణాన్ని జపరోవ్ హైలైట్ చేశారు. పునరుత్పాదక ఇంధనం, వ్యవసాయం, పర్యాటకం, మైనింగ్ రంగాలలో అందుబాటులో ఉన్న విస్తారమైన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కాగా,కిర్గిజ్స్తాన్‌లో పెట్టుబడి పెట్టడానికి సౌదీ వ్యాపార రంగం సంసిద్ధతను అల్వైజీ ధృవీకరించారు. అలాగే, రెండు దేశాల పెట్టుబడిదారుల మధ్య భాగస్వామ్యాలను బలోపేతం చేయడానికి కిర్గిజ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీలో భాగస్వాములతో కలిసి పనిచేయడానికి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్