అమెరికా స్థావరాలపై దాడికి ఇరాన్ సన్నాహాలు..!!

- June 23, 2025 , by Maagulf
అమెరికా స్థావరాలపై దాడికి ఇరాన్ సన్నాహాలు..!!

యూఏఈ: ఇరాన్ లోని అణు కేంద్రాలను నాశనం చేసినట్లు అమెరికా ప్రకటించింది. అయితే, అమెరికా దాడులపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. మధ్యప్రాచ్యంలోని అమెరికా స్థావరాలపై దాడులు చేస్తామని హెచ్చరించింది.  ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ సలహాదారు అలీ అక్బర్ వెలాయతి మాట్లాడుతూ..అమెరికా అన్ని హద్దులను చేరిపేసిందని, త్వరలోనే వారి మిడిలీస్ట్ లోని స్థావరాలపై దాడి చేసే అవకాశం ఉందన్నారు.

ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య వైమానిక దాడులు ఉధృత రోజురోజుకు పెరుగుతోంది. ఇరాన్‌లోని సైనిక కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తుంది.  అంతకుముందు ఫోర్డోలోని కీలకమైన భూగర్భ యురేనియం కేంద్రంపై, ఇస్ఫహాన్, నటాంజ్‌లోని అణు సౌకర్యాలపై ఆకస్మిక దాడులు ప్రారంభించిన తర్వాత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను సంఘర్షణను ముగించాలని కోరారు.

టెహ్రాన్ లో నిరసనలు
అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా ప్రజలు సెంట్రల్ టెహ్రాన్‌లో గుమిగూడి, జెండాలు ఊపుతూ వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.    

18 గంటలు
ఏడు B-2 స్పిరిట్ బాంబర్లు, ఇవి అమెరికన్ ప్రధాన భూభాగం నుండి ఇరాన్‌కు 18 గంటలు ప్రయాణించాయి. డజనుకు పైగా భారీ "బంకర్ బస్టర్" బాంబులను ఉపయోగించారు. దీనికి ప్రతిస్పందనగా  ఇరాన్ సాయుధ దళాలు టెల్ అవీవ్ సమీపంలోని బెన్ గురియన్ విమానాశ్రయంతో సహా ఇజ్రాయెల్‌లోని ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని మిస్సైల్స్ తో విరుచుకుపడ్డారు.   

ఇజ్రాయెల్ దాడులలో ఇప్పటివరకు 400 మందికి పైగా మరణించాయని ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అధికారిక గణాంకాల ప్రకారం.. ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడుల్లో 24 మంది మరణించారు.

కాగా,  యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, ఒమన్.. అమెరికా దాడులను ఖండించాయి. అయితే ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ టెహ్రాన్‌ను "మిడిలీస్ట్ లో భద్రతను అస్థిరపరిచే ఎటువంటి చర్య తీసుకోవద్దని" పిలుపునిచ్చాయి. మరోవైపు యుఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ అమెరికన్లకు "ప్రపంచవ్యాప్తంగా హెచ్చరిక" జారీ చేసింది.     

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com