సౌదీ అరేబియాలో వర్కర్లకు థార్డ్ ఫేజ్ 'ఈ-ట్రాన్స్ ఫర్' ప్రారంభం..!!
- July 02, 2025
రియాద్: డిజిటల్ వాలెట్ల ద్వారా గృహ కార్మికులకు ఎలక్ట్రానిక్ జీతం బదిలీ సేవ మూడవ దశ జూలై 1 నుండి అమల్లోకి వచ్చిందని సౌదీ అరేబియా మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మూడవ దశ ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ గృహ కార్మికులను కలిగి ఉన్న యజమానులకు వర్తిస్తుందని తెలిపారు.
ఈ సంవత్సరం జనవరి 1న నలుగురు కంటే ఎక్కువ గృహ కార్మికులను కలిగి ఉన్న యజమానులకు రెండవ దశ అమలు చేశారు. గృహ కార్మికుల సాలరీలను 3వ దశ ఈ-బదిలీ వ్యవస్థను మంత్రిత్వ శాఖ దశలవారీగా అమలు చేస్తోంది. అక్టోబర్ 1 నుండి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కార్మికులు ఉన్నవారికి ఇ-బదిలీ సాలరీ సేవ వర్తిస్తుంది. జనవరి 1, 2026 నాటికి అన్ని గృహ కార్మికులను ఈ కొత్త ప్రక్రియలో చేర్చుతారు.
ఈ చొరవ గృహ కార్మికుల జీతాలకు సంబంధించి వారి హక్కులకు హామీ ఇవ్వడం, గృహ కార్మికుల రంగాన్ని అభివృద్ధి చేయడానికి మంత్రిత్వ శాఖ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇస్తుందన్నారు. యజమానులు, గృహ కార్మికుల హక్కులను పెంచడం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రిత్వశాఖ వెల్లడించింది. ముసానెడ్ ప్లాట్‌ఫామ్ ద్వారా డిజిటల్ వాలెట్లు, ఆమోదించబడిన బ్యాంకుల ద్వారా దీనిని అమలు చేస్తున్నారు.దీని ద్వారా కార్మికులు అధికారిక మార్గాల ద్వారా నేరుగా తన దేశంలోని కుటుంబానికి జీతం పంపడానికి వీలు కల్పిస్తుందన్నారు.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్