జెడ్డా పోర్టులో భారీ స్మగ్లింగ్..భగ్నం చేసిన సౌదీ కస్టమ్స్..!!

- July 05, 2025 , by Maagulf
జెడ్డా పోర్టులో భారీ స్మగ్లింగ్..భగ్నం చేసిన సౌదీ కస్టమ్స్..!!

జెడ్డా: జెడ్డా ఇస్లామిక్ పోర్టు ద్వారా 646,000 యాంఫేటమిన్ మాత్రలను అక్రమంగా రవాణా చేసే ప్రయత్నాన్ని జకాత్, పన్ను మరియు కస్టమ్స్ అథారిటీ (ZATCA) అడ్డుకుంది. అథారిటీ ప్రతినిధి హమౌద్ అల్-హర్బీ ప్రకారం.. ఆహార పదార్థాలు, ఫావా బీన్స్ అని లేబుల్ చేయబడిన షిప్‌మెంట్‌లో వాటిని దాచి తరలిస్తున్నట్లు పేర్కొన్నారు.  అధునాతన భద్రతా స్క్రీనింగ్ టెక్నాలజీలను ఉపయోగించి తనిఖీలు చేయగా ఈవ్యవహారం బయటపడిందని తెలిపారు.  ఈ కేసుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు తెలిపారు.

ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలను నియమించబడిన భద్రతా హాట్‌లైన్ 1910, [email protected] ఇమెయిల్ లేదా అంతర్జాతీయ నంబర్ +9661910 ద్వారా నివేదించడం ద్వారా జాతీయ స్మగ్లింగ్ నిరోధక ప్రయత్నాలకు సహకరించాలని ప్రతినిధి ప్రజలను కోరారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com