SR528 బిలియన్లు.. ప్రపంచంలోని టాప్ డోనర్లలో సౌదీ అరేబియా..!!

- July 06, 2025 , by Maagulf
SR528 బిలియన్లు.. ప్రపంచంలోని టాప్ డోనర్లలో సౌదీ అరేబియా..!!

రియాద్: సౌదీ అరేబియా ప్రపంచవ్యాప్తంగా అందించే ఆర్థిక సహాయం మొత్తం విలువ సుమారు SR528.4 బిలియన్లు ($140.9 బిలియన్లు) అని సౌదీ సహాయ వేదిక వెల్లడించింది.  ఇది ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద దాతలలో ఒకటిగా సౌదీ తన స్థానాన్ని నిలుపుకుందన్నారు.
సౌదీ అధికారిక వేదిక వెల్లడించిన ప్రకారం, సౌదీ సహాయం ద్వారా అత్యధికంగా ప్రయోజనం పొందిన దేశాల జాబితాలో ఈజిప్ట్ మొత్తం $32.49 బిలియన్లతో అగ్రస్థానంలో ఉంది.  తరువాత యెమెన్ $27.69 బిలియన్లు, పాకిస్తాన్ $13.19 బిలియన్లతో ఉన్నాయి. అత్యధికంగా ప్రయోజనం పొందిన దేశాల జాబితాలో సిరియా($7.53 బిలియన్), ఇరాక్: $7.33 బిలియన్, పాలస్తీనా: $5.37 బిలియన్లు ఉన్నాయి.  

మానవతా సంక్షోభాలు,  ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడంలో ప్రజలు,  దేశాలకు మద్దతు ఇవ్వడం మరియు స్థిరమైన అభివృద్ధిని సాధించడం ద్వారా సౌదీ అరేబియా తన మానవతా, అభివృద్ధి పాత్రకు నిబద్ధతను ప్రతిబింబిస్తాయన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com