గ్లోబల్ డిజిటల్ కంటెంట్ అవార్డును గెలిచిన బహ్రెయిన్ పార్లమెంట్..!!

- July 14, 2025 , by Maagulf
గ్లోబల్ డిజిటల్ కంటెంట్ అవార్డును గెలిచిన బహ్రెయిన్ పార్లమెంట్..!!

మనామా: బహ్రెయిన్ కౌన్సిల్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ (పార్లమెంట్) దాని వినూత్న “MP పోర్టల్” ప్రాజెక్ట్‌కు గుర్తింపు లభించింది. ఇన్క్లూజన్,  ఎంపవర్‌మెంట్ విభాగంలో ప్రతిష్టాత్మక బహ్రెయిన్ డిజిటల్ కంటెంట్ అవార్డు (BDCA) 2025ను అందుకుంది. డిజిటల్ ఆవిష్కరణకు పార్లమెంట్ అసాధారణ సహకారానికిఅవార్డుకు ఎంపిక చేసినట్లు తెలిపారు. MPలు, ప్రజల మధ్య కమ్యూనికేషన్, పారదర్శకతను పెంపొందించడానికి రూపొందించబడిన వేదిక అయిన MP పోర్టల్..  సమ్మిళిత డిజిటల్ సేవలను పార్లమెంటరీ పనికి మద్దతుకు ప్రశంసలు లభించాయి.

ఈ అవార్డు ప్రదానోత్సవం గల్ఫ్ హోటల్‌లో షురా కౌన్సిల్ ఛైర్మన్ ఆధ్వర్యంలో జరిగింది. రిసోర్సెస్ అండ్ సర్వీస్ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ డాక్టర్ సక్ర్ అల్-షిరావి పార్లమెంట్ తరపున ఈ అవార్డును అందుకున్నారు. పార్లమెంట్ స్పీకర్ అహ్మద్ బిన్ సల్మాన్ అల్ ముసల్లం చొరవ కారణంగా ఇది సాధ్యమైందని ప్రశంసలు కురిపించారు.   ఈ జాతీయ అవార్డును గెలుచుకోవడం బహ్రెయిన్ పార్లమెంటును ప్రజాస్వామ్య ప్రక్రియలను బలోపేతం చేయడానికి, డిజిటల్ సాధికారతను ప్రోత్సహించడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో ప్రముఖ నమూనాగా నిలిచిందని వక్తలు ప్రశంసించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com