ఒమన్ ఆహార భద్రతకు నాంది.. 90,000MT రా షుగర్ దిగుమతి..!!

- August 03, 2025 , by Maagulf
ఒమన్ ఆహార భద్రతకు నాంది.. 90,000MT రా షుగర్ దిగుమతి..!!

సోహార్: ఆహార భద్రత దిశగా ఒమన్ అడుగులు వేసింది. మొదటి చక్కెర శుద్ధి కర్మాగారం 90,000 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ రా షుగర్ ను దిగుమతి చేసుకుంది.  ఇది ఆహార తయారీ కార్యకలాపాలలో విస్తరణకు నాంది పలికిందని, ఇది స్థానిక సరఫరాచైన్ కు మద్దతు ఇస్తుందన్నారు.పారిశ్రామిక నైపుణ్యాలను అభివృద్ధి చేయడంతో పాటు కొత్త గ్రాడ్యుయేట్లు, స్థానిక సాంకేతిక సిబ్బందికి ఆశాజనక అవకాశాలను అందించడానికి దోహదపడుతుందని చక్కెర శుద్ధి కర్మాగారం డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ నాసర్ బిన్ అలీ అల్ హోస్ని తెలిపారు.

సోహార్ పారిశ్రామిక నౌకాశ్రయంలో 180,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ శుద్ధి కర్మాగారాన్ని నిర్మించారు. మధ్యప్రాచ్యంలో ఇదే మొదటిది అని పేర్కొన్నారు.  అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏటా ఒక మిలియన్ టన్నుల వరకు షుగర్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుందన్నారు. ఈ ఉత్పత్తి స్థానిక, ప్రాంతీయ, ఎగుమతి మార్కెట్లకు సేవలు అందిస్తుందన్నారు.

బ్రెజిల్ నుండి మొదటి షిప్‌మెంట్, మొత్తం 90,000 మెట్రిక్ టన్నులు రాగా, ఆటోమేటెడ్ మొబైల్ క్రేన్‌లు , హై-స్పీడ్ రవాణా వ్యవస్థలను ఉపయోగించి రిఫైనరీలోకి చేర్చారు. వచ్చే సెప్టెంబర్‌లో వాణిజ్యపరంగా ఉత్పత్తిని ప్రారంభించడానికి కార్యాకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించినట్లు ఆయన వివరించారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com