మొదటి సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టును ప్రారంభించిన బహ్రెయిన్..!!
- August 08, 2025
మనామా: బహ్రెయిన్ లో మొట్టమొదటి సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. బిలాజ్ అల్ జజాయర్ లో 150 మెగావాట్ల ప్రణాళికా సామర్థ్యంతో ఏర్పాటు చేసినట్లు ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ (EWA) తెలిపింది. 2060 నాటికి కార్బన్ ఉద్గారాలను జీరో స్థాయికి తగ్గించే లక్ష్యంతో ప్రైవేట్ భాగస్వామ్యంతో సోలార్ ప్లాంట్ను అభివృద్ధి చేస్తున్నట్లు అథారిటీ ప్రెసిడెంట్ హిస్ ఎక్సలెన్సీ ఇంజనీర్ కమల్ బిన్ అహ్మద్ మొహమ్మద్ తెలిపారు.
ఈ ప్రాజెక్టు పునరుత్పాదక ఇంధన ఉత్పత్తితో పాటు బహ్రెయిన్ ఇంధన భద్రతను బలోపేతం చేస్తుందన్నారు. ఈ సౌర విద్యుత్ కేంద్రం బహ్రెయిన్ జాతీయ పునరుత్పాదక ఇంధన ప్రణాళిక కింద ఒక ప్రధాన ప్రాజెక్ట్ అని, 2035 నాటికి క్లీన్ ఎనర్జీ వాటాను 20 శాతానికి పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్లాంట్ దాదాపు 6,300 ఇళ్లకు అవసరమైన విద్యుత్తును ఉత్పత్తి చేస్తుందని, అలాగే ఏటా 100,000 టన్నులకు పైగా కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తుందని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్