గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు.. ఐదుగురు జర్నలిస్టులు మృతి..
- August 11, 2025
హమాస్ వేరివేతే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ సైన్యం భీకర దాడులు చేస్తోంది. తాజాగా.. తూర్పు గాజా నగరంలోని అల్-షిఫా ఆస్పత్రి సమీపంలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ప్రముఖ మీడియా సంస్థ అల్ జజీరాకు చెందిన ఐదుగురు జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఆస్పత్రి మెయిన్ గేట్ బయట ఉన్న ప్రెస్ టెంట్ పై ఇజ్రాయెల్ దాడి చేసిందని అల్ జజీరా మీడియా సంస్థ తెలిపింది.
ఈ ఘటనలో మొత్తం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఐదుగురు అల్ జజీరా మీడియా సంస్థ జర్నలిస్టులు ఉన్నారు. మృతిచెందిన జర్నలిస్టుల్లో అల్ జజీరా కరస్పాండెంట్స్ అనాస్ అల్ షరీఫ్, మహమ్మద్ ఖ్రీకె, కెమెరామెన్లు ఇబ్రహీం జహీర్, మోమెన్ ఆలివా, మహ్మద్ నౌఫల్ ఉన్నారు.
ఈ దాడులపై ఇజ్రాయెల్ మిలిటరీ ఓ ప్రకటన విడుదల చేసింది. దాడిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఐదుగురు జర్నలిస్టులు ఉన్నారు. వారిలో ఒకరు హమాస్ ఉగ్రవాది అని ఇజ్రాయెల్ మిలిటరీ పేర్కొంది. అనాస్ అల్ షరీఫ్ అనే వ్యక్తి ఆల్ జజీరా సంస్థలో చేరి జర్నలిస్టు ముసుగులో ఇజ్రాయెల్ పై దాడులకు కుట్రలు పన్నుతున్నట్లు ఇజ్రాయెల్ పేర్కొంది. గాజా నుంచి సేకరించిన పత్రాలు, ఉగ్రవాదుల శిక్షణ జాబితా, వేతన రికార్డులను పరిశీలించిన తరువాత అతడు హమాస్ ఉగ్రవాది అని నిర్దరించినట్లు తెలిపింది.
గాజాలో అత్యంత ధైర్యవంతులైన జర్నలిస్టుల్లో అనాస్ అల్ షరీఫ్ ఒకరని అల్ జజీరా పేర్కొంది. గాజా యుద్ధంపై ఫ్రంట్లైన్ రిపోర్టింగ్ చేసినందుకు అతన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ మిలిటరీ దాడులు చేసిందని, ఇజ్రాయెల్ చేసే వాదనకు ఆధారాలు లేవని హక్కుల న్యాయవాదులు తెలిపారు. ఈ దాడిని పాలస్తీనా జర్నలిస్టుల సంఘం తీవ్రంగా ఖండించింది.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్