కువైట్ లో కొత్తగా నాలుగు పర్యాటక వీసా కేటగిరీలు..!!

- August 12, 2025 , by Maagulf
కువైట్ లో కొత్తగా నాలుగు పర్యాటక వీసా కేటగిరీలు..!!

కువైట్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రయాణికుల వివిధ అవసరాలను పరిగణనలోకి తీసుకొని,  కువైట్ ప్రభుత్వం కొత్తగా నాలుగు-కేటగిరుల్లో పర్యాటక వీసా ఫ్రేమ్‌వర్క్‌ను ప్రకటించింది. వీసా రకాన్ని బట్టి వివిధ వర్గాలకు వీసా చెల్లుబాటు 30 రోజుల నుండి 360 రోజుల వరకు ఉంటుంది.

మొదటి వర్గం వీసాలను బలమైన ఆర్థిక సూచికలు కలిగిన దేశాల పౌరులకు, వివిధ రకాల వీసా ఎంపికలను అందిస్తుంది. రెండవ కేటగిరిని GCC పౌరులు, ప్రొఫెషనల్స్ కు మరియు చెల్లుబాటు అయ్యే అమెరికా, బ్రిటన్ స్కెంజెన్ వీసాలను కలిగి ఉన్న వ్యక్తులకు కేటాయించారు.

ఇక త్వరలో ప్రారంభించబడే మూడవ కేటగిరిని ఇతర దేశాల్లోని భారీ ఇన్వెస్టర్లకు కేటాయించానున్నారు. నాల్గవ వర్గం కువైట్‌లో ఈవెంట్‌లు, కార్యకలాపాలకు హాజరయ్యే సందర్శకులను కవర్ చేస్తుందన్నారు.  ప్రాంతీయ పర్యాటక కేంద్రంగా కువైట్ స్థానాన్ని మెరుగు పరచడానికి దోహదం చేస్తుందన్నారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com