ఆగస్టు 31న GCC ఫోరం ఫర్ గ్రీన్ మొబిలిటీ ప్రారంభం..!!
- August 13, 2025
సలాలా: GCC ఫోరం ఫర్ గ్రీన్ మొబిలిటీ 2025 ఆగస్టు 31న దోఫర్ గవర్నరేట్‌లోని సలాలాలోని విలాయత్‌లో ప్రారంభమవుతుంది. రవాణా రంగంలో పర్యావరణ స్థిరత్వాన్ని ప్రోత్సహించడంతోపాటు ప్రత్యామ్నాయ రవాణా విధానాల వినియోగాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ ఫోరాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో జీసీసీ దేశాల నుంచి వాహన రంగ నిపుణులు పాల్గొంటారు. రవాణా రంగంలో కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి దోహదపడే కీలక విధానాలపై చర్చిస్తారు.
ముఖ్యంగా సలాలాలోని సుల్తాన్ ఖబూస్ యూత్ కాంపౌండ్ ఫర్ కల్చర్ అండ్ ఎంటర్టైన్మెంట్లో జరిగే "గల్ఫ్ యూత్ లీడ్ చేంజ్" వర్క్‌షాప్ మరియు "గ్రీన్ కారిడార్స్ ఫర్ గల్ఫ్ పోర్ట్స్" వర్క్‌షాప్ లు జరుగుతాయి. ఈ సందర్భంగా గ్రీన్ ట్రాన్స్పోర్ట్ రంగంలో అనేక ఒప్పందాలు జరిగే అవకాశం ఉందన్నారు. దీంతోపాటు ఆగస్టు 15-16 తేదీలలో పిల్లలకు పర్యావరణ సంబంధిత అంశాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్‌టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్