రెస్టారెంట్ యజమానికి 3 ఏళ్ల జైలుశిక్ష విధించిన బహ్రెయిన్ కోర్టు..!!

- August 21, 2025 , by Maagulf
రెస్టారెంట్ యజమానికి 3 ఏళ్ల జైలుశిక్ష విధించిన బహ్రెయిన్ కోర్టు..!!

మనామా: బహ్రెయిన్ లో 50 ఏళ్ల రెస్టారెంట్ యజమానికి మూడవ హై క్రిమినల్ అప్పీల్స్ కోర్టు మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఆరాడ్ భవనం కూలిపోయిన కేసులో ఈ శిక్ష విధించింది. ఆరాడ్ భవనం కూలిపోయిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. 

కాగా, పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రాథమిక తీర్పును అప్పీల్ చేసింది.  నిందితుడి నిర్లక్ష్యం ఈ విషాదానికి దారితీసిందని వాదించింది. భద్రతా నిబంధనలను ఉల్లంఘించడం వల్ల రెస్టారెంట్ నుండి గ్యాస్ లీక్ కావడం వల్ల మొత్తం భవనం కూలిపోయిన పేలుడు సంభవించిందని దర్యాప్తులో కూడా తేలిందని పేర్కొంది.

రెస్టారెండ్ యజమాని భద్రతా పరమైన అనుమతులు పొందకుండా రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్నాడని, ఆమోదం లేని  గ్యాస్ డిటెక్షన్ వ్యవస్థలను ఉపయోగించాడని అధికారులు నిర్ధారించారు. భద్రత మరియు చట్టపరమైన అవసరాలను పాటించడంలో విఫలమైనందుకు  కోర్టు అతడిని దోషిగా నిర్ధారించి జైలుశిక్ష విధించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com