కువైట్ లో రోడ్లపై వాహనాలను వదిలేస్తున్నారా? జాగ్రత్త..!!
- August 23, 2025
కువైట్ : కువైట్ మునిసిపాలిటీ వాహనదారులను హెచ్చరించింది. బహిరంగ ప్రదేశాలు, రోడ్లు, స్ట్రీట్స్ లలో తమ వాహనాలను వదిలివేయవద్దని సూచించింది. ఇటువంటి పద్ధతుల కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతాయని, అలాగే తరచూ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందని తెలిపింది. ఇలా రోడ్లపై వదిలేసిన వాహన యజమానులకు KD 100 వరకు జరిమానా విధించబడుతుందని మునిసిపాలిటీ హెచ్చరించింది. వీటితోపాటు వాహనాన్ని యార్డ్ నుండి తొలగించే వరకు అయ్యే రవాణా ఖర్చులు, రోజువారీ ఇంపౌండ్మెంట్ రుసుములను చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. వాహనదారులు నిబంధనలను పాటించాలని మరియు నిర్దేశిత ప్రాంతాలలో వాహనాలను పార్కింగ్ చేయాలని సూచించింది.
తాజా వార్తలు
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..