ఆరిజిన్ 2025 ఉమెన్ ఫోరం.. 15 దేశాల నుంచి మహిళలు హాజరు..!!

- August 26, 2025 , by Maagulf
ఆరిజిన్ 2025 ఉమెన్ ఫోరం.. 15 దేశాల నుంచి మహిళలు హాజరు..!!

మస్కట్: గల్ఫ్ లీడర్స్ సర్కిల్ మరియు మస్కట్ మీడియా గ్రూప్ నిర్వహించిన ది ఆరిజిన్ - ఉమెన్ ఫోరం & అవార్డ్స్ 2025 రెండవ ఎడిషన్..  ఒమన్ మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభావమంతమైన మహిళలను ఒక చోటకు చేర్చింది.  ఈ కార్యక్రమంలో ఒమన్, సౌదీ అరేబియా, జోర్డాన్, జపాన్, భారతదేశం, యునైటెడ్ స్టేట్స్, కెనడా, బ్రూనై, ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నెదర్లాండ్స్ మరియు గ్రీస్‌తో సహా 15 కి పైగా దేశాల నుండి 180 మందికి పైగా ప్రభావవంతమైన మహిళా లీడర్లు, నిపుణులు హాజరయ్యారు. 

విస్పర్స్ ఆఫ్ సెరెనిటీ క్లినిక్ వ్యవస్థాపకురాలు మరియు నాట్ అలోన్ మెంటల్ హెల్త్ అవేర్‌నెస్ క్యాంపెయిన్ అధిపతి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి హర్ హైనెస్ సయ్యిదా బాస్మా అల్ సైద్ కీలక ఉపన్యాసం ఇచ్చారు. మహిళలు పోషించే అనేక పాత్రల గురించి స్ఫూర్తిదాయకమైన ప్రసంగంతో కార్యక్రమం ప్రారంభమైంది. 

మొహ్సిన్ హైదర్ దర్విష్ (ITICS) చైర్‌పర్సన్ మరియు దక్షిణాఫ్రికా నుండి ఒమన్‌కు గౌరవ కాన్సుల్ అయిన హర్ ఎక్సలెన్సీ లుజైనా మొహ్సిన్ దర్విష్.. బిజినెస్, అడ్మినిస్ట్రేషన్ లో లీడర్షిప్ ప్రాముఖ్యత గురించి మాట్లాడారు. మహిళలు కలలు కనడానికి ధైర్యం చేయాలని, వాటిని సాధించేందుకు ఎంతవరకైనా వెళ్లేందుకు సిద్ధపడాలని సూచించారు.   

“ఉమెన్ లీడింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఇన్నోవేషన్” అనే ప్యానెల్ చర్చ.. మహిళల్లో ధైర్యాన్ని నింపింది. అన్ని రంగాలలో మహిళలు అద్భుతంగా రాణిస్తున్నారని వక్తలు కొనియాడారు.  అనంతరం వివిధ విభాగాలలో విశేష కృషి చేసిన 25 మందిని సత్కరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com