సెప్టెంబర్ 1 నుండి ప్రధాన RAK మెయిన్ రోడ్ మూసివేత..!!
- August 27, 2025
యూఏఈ: షేక్ మొహమ్మద్ బిన్ సేలం రోడ్ (E11) అభివృద్ధి ప్రాజెక్టును ప్రారంభించినట్లు రస్ అల్ ఖైమా పబ్లిక్ సర్వీసెస్ విభాగం ప్రకటించింది. ఇది ఎమిరేట్ అంతటా కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు.
అల్ హమ్రా రౌండ్అబౌట్ నుండి షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్ (E311) తో జంక్షన్ వరకు ఉన్న ఈ ప్రాజెక్ట్, రష్ అల్ ఖైమాలో రోడ్డు, యుటిలిటీ నెట్‌వర్క్‌లను విస్తరించే సమగ్ర ప్రణాళికలో భాగం అని తెలిపారు. నిర్మాణ పనుల కోసం రోడ్డును సెప్టెంబర్ 1 నుంచి మూసివేయనున్నట్లు పేర్కొన్నారు.
మొదటి దశలో ప్రతి దిశలో రోడ్డును రెండు లేన్‌ల నుండి నాలుగు లేన్‌లకు విస్తరిస్తారు. దాంతో పాటు పవర్, టెలికమ్యూనికేషన్స్, నీటిపారుదల మరియు వర్షపు నీటి పారుదల వంటి ముఖ్యమైన యుటిలిటీ నెట్‌వర్క్‌లను డెవలప్ చేయనున్నారు.
మొదటి దశ ట్రాఫిక్ మళ్లింపు ప్రణాళికలో భాగంగా అల్ హమ్రా రౌండ్‌అబౌట్ వద్ద E11 ను మూసివేస్తారు. ట్రాఫిక్ ను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లిస్తారు. ఇందు కోసం 2 కి.మీ తాత్కాలిక రహదారిని నిర్మించారు.
ప్రాజెక్ట్ రెండవ దశతో రోడ్డు విస్తరణ పనులు పూర్తవుతాయి. వీటిలో నాలుగు డాల్ఫిన్ జంక్షన్ (S4), E11–E311 జంక్షన్ (D1), రెడ్ టన్నెల్ (S3) మరియు మినా అల్ అరబ్ టన్నెల్ (F1/F2) ఉన్నాయి. రస్ అల్ ఖైమాలో పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా రోడ్ నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్నారు.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్