సౌదీ అరేబియాలో ముగిసిన బర్గర్ చైన్ హాంబర్గి సేవలు..!!

- August 30, 2025 , by Maagulf
సౌదీ అరేబియాలో ముగిసిన బర్గర్ చైన్ హాంబర్గి సేవలు..!!

రియాద్: 12 సంవత్సరాల పాటు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన తర్వాత, సౌదీ అరేబియా లోని హాంబర్గిని బర్గర్ చైన్ కథ ముగిసింది.  దాని మాతృ సంస్థ అయిన అససియత్ అల్-ఘితా ట్రేడింగ్‌ను రద్దు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.  వినియోగదారుల విశ్వాసాన్ని దెబ్బతీసి, కంపెనీని దివాలా తీయించిన ఒక పెద్ద ఫుడ్ పాయిజనింగ్ సంఘటన తర్వాత ఈ తీర్పు వెలువడింది.

దివాలా ట్రస్టీ ముబారక్ అల్-అనాజీ గత వారం రియాద్ కమర్షియల్ కోర్టు లిక్విడేషన్ చర్యలను ఆదేశించిందని మరియు తీర్పు వెలువడిన 90 రోజుల్లోపు క్లెయిమ్‌లను సమర్పించాలని రుణదాతలను కోరినట్లు ప్రకటించారు.

2013లో రియాద్‌లో స్థాపించబడిన హాంబర్గిని..  డిజిటల్ మార్కెటింగ్ మరియు బలమైన సోషల్ మీడియా ఉనికి ద్వారా యువ వినియోగదారులలో గుర్తింపు పొందింది. 2015 మరియు 2019 మధ్య సౌదీ అరేబియాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందింది. ప్రముఖ బర్గర్ బ్రాండ్లలో ఒకటిగా గుర్తింపు సాధించింది. హాంబర్గిని సౌదీ అరేబియా అంతటా 57 శాఖలను నిర్వహించింది.  

రియాద్‌లో 2024లో జరిగిన ఫుడ్ పాయిజన్ సంఘటనలో 70 మందికి పైగా అనారోగ్యానికి గురయ్యారు. ఒకరు మరణించారు. క్లోస్ట్రిడియం బోటులినమ్‌తో కలుషితమైన దిగుమతి చేసుకున్న "బాన్ తుమ్" మయోసాస్ బ్రాండ్ ఫుడ్ పాయిజన్ కు కారణమని దర్యాప్తులో తేలింది. దీంతో అధికారులు రియాద్‌లోని అన్ని హాంబర్గిని బ్రాంచీలను సీజ్ చేశారు.  ఉత్పత్తిని నిలిపివేయించడంతో అది ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది.     

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com