భారత ప్రవాసుల కోసం కొత్త పాస్‌పోర్ట్ ఫోటో రూల్స్ ఇవే..!!

- August 30, 2025 , by Maagulf
భారత ప్రవాసుల కోసం కొత్త పాస్‌పోర్ట్ ఫోటో రూల్స్ ఇవే..!!

దుబాయ్: కొత్త పాస్‌పోర్ట్ లేదా రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకునే దుబాయ్‌లోని భారతీయ ప్రవాసులు సెప్టెంబర్ 1 నుండి తాజా ఫోటో రూల్స్ ను పాటించాల్సి ఉంటుంది. ఎమిరేట్‌లోని భారత కాన్సులేట్ ఇప్పుడు అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఇకావో) ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న ఫోటోలను కలిగి ఉండాలని ప్రకటించింది.  దరఖాస్తుదారులు తమ పాస్‌పోర్ట్ పత్రాలను సమర్పించేటప్పుడు అప్డేట్ చేసిన స్పెసిఫికేషన్‌లకు సరిపోయే కొత్త ఫోటోలను సమర్పించాల్సి ఉంటుంది.  

అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ ప్రకారం కొత్త పాస్‌పోర్ట్ ఫోటో గైడ్ లైన్స్ క్రింది విధంగా ఉన్నాయి:

ఫోటో ఫార్మాట్: వైట్ బ్యాక్ గ్రౌండ్ .. 630*810 పిక్సెల్‌ సైజ్

ఫ్రేమింగ్ : హెడ్ అండ్ షోల్డర్ వరకు క్లోజప్, ఫ్రేమ్‌లో 80-85 ఫేస్ కనబడాలి.

ఫోటో క్వాలిటీ:

- కంప్యూటర్ మార్పులు లేదా ఫిల్టర్‌లు వాడకూడదు.

- నాచురల్ స్కిన్ టోన్‌లు కనిపించాలి

- ఫోటో అస్పష్టంగా ఉండకూడదు

లైటింగ్:

- షేడ్స్ లేకుండా సమానంగా లైటింగ్ ఉండాలి.

- ఫ్లాష్ రిఫ్లెక్షన్‌లు, గ్లేర్ లేదా రెడ్-ఐ ఎఫెక్ట్ కన్పించకూడదు

- సరైన లైటింగ్, కాంట్రాస్ట్ ఉండాలి

ఫేషియల్ ఫీచర్స్:

- కళ్ళు తెరిచి ఉండాలి. స్పష్టంగా కన్పించాలి.

- మౌత్ మూసి ఉండాలి.

- హెయిర్ నుండి చిక్ వరకు మొత్తం ఫేస్ కనిపించాలి

కవరింగ్‌లు

- కళ్లద్దాలు ఉండకూడదు

- మతపరమైన కారణాల వల్ల తలను కవర్ చేసేలా అనుమతి. అయితే, ఫేస్ స్పష్టంగా కన్పించాలి. 

- ఫోటో 1.5 మీటర్ల దూరం నుంచి మాత్రమే తీసి ఉండాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com