ప్రభాస్ లాంచ్ చేసిన అనుష్క శెట్టి ‘ఘాటి’ రిలీజ్ గ్లింప్స్
- September 05, 2025
క్వీన్ అనుష్క శెట్టి, విజనరీ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా' ఘాటి' మరికొన్ని గంటల్లో తెరపైకి రానుంది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించిన ఈ చిత్రాన్ని UV క్రియేషన్స్ సమర్పిస్తున్నారు. ఈ సినిమా ప్రతి ప్రమోషనల్ కంటెంట్ అంచనాలని పెంచింది. విడుదలకు ఒక రోజు ముందు రెబెల్ స్టార్ ప్రభాస్ ఘాటీ రిలీజ్ గ్లింప్స్‌ను లాంచ్ చేశారు.
అనుష్క శెట్టి శీలావతి పాత్రలో అదరగొట్టారు. ఘాటీ సమాజం ఎదురుకుంటున్న పరిస్థితులకు ఎదురుతిరి ఆమె చేసిన పోరాటం గూజ్బంప్స్ తెప్పించింది. దర్శకుడు క్రిష్ ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో ఇంటెన్స్, ఎమోషన్ రెండింటిని అద్బుతంగా బ్యాలెన్స్ చేసి అడ్రినలిన్ రష్ ఇచ్చేలా తీర్చిదిద్దారు.
విద్యాసాగర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవల్ లో వుంది. రామ్ కృష్ణ డిజైన్ చేసిన యాక్షన్ సీక్వెన్సులు రియలిస్టిక్‌గా అదిరిపోయాయి. మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ కూడా ఘాట్ల, రివల్యూషన్ గ్రాండియర్ రెండింటినీ అద్భుతంగా చూపించింది.
అనుష్క పెర్ఫార్మెన్స్ ప్రతి ఫ్రేమ్‌లో అద్భుతంగా వుంది. ఇంటెన్స్, రిజిలియన్స్‌తో కూడిన ఆమె నటనలో ఒక్క డైలాగ్‌తోనే గ్లింప్స్ ఇంపాక్ట్ వచ్చేసింది. విక్రమ్ ప్రభు కూడా ఇంటెన్స్ క్యారెక్టర్ లో ఆకట్టుకున్నారు. తోట తరణి ఆర్ట్ డైరెక్షన్, సాయి మాధవ్ బుర్ర డైలాగ్స్, ఎడిటర్స్ చాణక్య రెడ్డి తూరుపు – వెంకట్ ఎన్. స్వామి వర్క్ కూడా హైలైట్‌గా నిలిచింది.
ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్, UV క్రియేషన్స్ హై ప్రొడక్షన్ వాల్యూస్‌తో తెరకెక్కిన ఘాటీ గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వనుంది. థియేటర్స్‌లో రేపట్నుంచే ఈ ఇంటెన్స్ యాక్షన్ రైడ్‌కు గెట్ రెడీ.
తారాగణం: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు, చైతన్య రావు, రవీంద్రన్ విజయ్, జగపతి బాబు
సాంకేతిక సిబ్బంది:
రచన & దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి
నిర్మాతలు: రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి
ప్రెజెంట్స్: UV క్రియేషన్స్
బ్యానర్: ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: మనోజ్ రెడ్డి కాటసాని
ఆర్ట్ డైరెక్టర్: తోట తరణి
సంగీతం: నాగవెల్లి విద్యా సాగర్
డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా
కథ: చింతకింది శ్రీనివాసరావు
ఎడిటర్: చాణక్య రెడ్డి తూరుపు, వెంకట్ ఎన్ స్వామి
యాక్షన్ కొరియోగ్రఫీ: రామకృష్ణ
పీఆర్వో: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్‌టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్