ఒడిశాలో పిడుగుపాటుకు బలైన వారి సంఖ్య 56కు...

- August 03, 2016 , by Maagulf
ఒడిశాలో పిడుగుపాటుకు బలైన వారి సంఖ్య 56కు...

మరో నలుగురు వ్యక్తులు మృత్యువాత పడటంతో ఒడిశాలో పిడుగుపాటుకు బలైన వారి సంఖ్య 56కు చేరుకుంది. మంగళవారం బోలంగీర్‌, జగత్సింగ్‌పూర్‌, కుర్దా, కటక్‌లలో ఒక్కొక్కరు చొప్పున నలుగురు చనిపోవడంతో గత నాలుగు రోజుల్లో పిడుగుపాటు ప్రమాదంతో చనిసోయిన వారి సంఖ్య 56కు పెరిగినట్లు అధికారులు తెలిపారు. జులై 30నాటికి మృతుల సంఖ్య 41 ఉండగా 31న మరో 11మరణాలు నమోదయ్యాయి. ఒక్క బాలసోర్‌ జిల్లాలోనే 8 మంది చనిపోగా, భద్రక్‌, మయూర్‌భంజ్‌, కుర్దా జిల్లాల్లో ఏడుగురు చొప్పున, కటక్‌లో ఆరుగురు, జైపూర్‌, దెంకనల్‌ జిల్లాల్లో నలుగురు చొప్పున, కియోంఝర్‌, నబరంగ్‌పూర్‌ జిల్లాల్లో ఇద్దరు చొప్పున, నయగార్‌లో ముగ్గురు, పూరీ, దియోగ్రా, కేంద్రపరా, జర్సుగూడ, బోలంగీర్‌, జగత్సింగ్‌పూర్‌ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 56 మంది మృతి చెందినట్లు అధికారులు వివరించారు. కాగా.. మృతుల కుటుంబాలకు నాలుగు లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com