'రైల్‌'విడుదల ఖరారు

- September 12, 2016 , by Maagulf
'రైల్‌'విడుదల ఖరారు

ధనుష్‌, కీర్తీసురేశ్‌ జంటగా నటించిన 'రైల్‌' చిత్రం సెన్సార్‌ పనులు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్‌ బోర్డు నుంచి క్లీన్‌ 'యు' సర్టిఫికెట్‌ లభించినట్లు హీరో ధనుష్‌ తన ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. చిత్రం విడుదల కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 22న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామని, 2016లో విడుదలవుతున్న తన తొలి చిత్రమిదని ట్వీట్‌ చేశారు. ఈ చిత్రాన్ని 'తొందరి' అనే టైటిల్‌తో తమిళంలో విడుదల చేస్తున్నారు.
ప్రభు సోలోమన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఆది రెడ్డి, ఆదిత్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com