గుత్తి క్యాప్సికం
- September 13, 2016
కావలసిన పదార్థాలు: క్యాప్సికం (చిన్నవి) - 8, నూనె - 1 టేబుల్ స్పూను, ఉప్పు - 1 టీ స్పూను.
కూరడానికి: టమోటాలు - 2, ఉల్లిపాయ - 1, క్యారెట్ - 1, బీన్స్ - 6, పచ్చిబఠాణి - గుప్పెడు, పనీర్ తురుము - 1 కప్పు, జీలకర్ర - 1 టీ స్పూను, అల్లం - అంగుళం ముక్క, పసుపు - అర టీ స్పూను, కారం - 1 టీ స్పూను, దనియాల పొడి - 2 టీ స్పూన్లు, కొత్తిమీర తరుగు - అరకప్పు, గరం మసాల - 1 టీ స్పూను, నూనె - 1 టేబుల్ స్పూను.
తయారుచేసే విధానం : కూరగాయల్ని సన్నగా తరగాలి. క్యాప్సికం తొడిమలతో పాటు, గింజలు తీసి లోపలి భాగమంతా ఉప్పు కలిపిన నూనె రాసి ప్రీ - హీట్ చేసిన ఒవెన్‌లో పది నిమిషాలు ఉంచి తీసెయ్యాలి. కడాయిలో నూనె వేసి జీలకర్ర, ఉల్లి, టమోటా, అల్లం, బీన్స్, పచ్చిబఠాణి, క్యారెట్ ముక్కలు 3 నిమిషాలు వేగించాలి. తర్వాత కారం, పసుపు, గరంమసాల చేర్చి 2 నిమిషాల తర్వాత అరకప్పు నీరు కలిపి మూతపెట్టాలి. చిక్కబడ్డాక పనీర్ తురుము, కొత్తిమీర వేసి మంట తీసెయ్యాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని క్యాప్సికంలో కూరి ఒవెన్‌లో 5 నిమిషాలు ఉంచి తీసెయ్యాలి.
తాజా వార్తలు
- సందర్శకులను అబ్బురపరుస్తున్న మస్కట్ నైట్స్..!!
- కువైట్ లో 45 మంది డ్రైవర్లకు జైలు శిక్ష..!!
- బహ్రెయిన్ లో పబ్లిక్ ట్రాన్స్ పోర్టుకు ఫుల్ డిమాండ్..!!
- ఇండోనేషియాలో జెట్ స్కీ ప్రమాదంలో సౌదీ సిటిజన్ మృతి..!!
- మెట్రాష్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు..!!
- జుమేరా బీచ్1 విస్తరణ 95% పూర్తయింది.. షేక్ హమ్దాన్
- ఒమన్‌లో సగటు ద్రవ్యోల్బణం 0.94 శాతం..!!
- సౌదీ అరేబియా బ్యాంకింగ్ రంగానికి భారీ మద్దతు..!!
- బహ్రెయిన్‌లో జనవరి 22 నుండి ఆటమ్ ఫెయిర్ 2026..!!
- కువైట్ లో జనవరి 18న పబ్లిక్ హాలీడే..!!







