దట్టమైన పొగమంచుతో 21 విమానాల రద్దు ..

- January 01, 2017 , by Maagulf
దట్టమైన పొగమంచుతో 21 విమానాల రద్దు ..

దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్స్‌ మొత్తం 21 విమానాల్ని రద్దు చేసినట్లు ప్రకటించింది. దట్టమైన పొగమంచుతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయాలు కలిగాయని అధికారులు తెలిపారు. ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రతినిథి మాట్లాడుతూ, దుబాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో చాలా విమాన రాకపోకలకు అంతరాయాలు ఏర్పడినట్లు చెప్పారు. ప్రయాణీకులకు కలిగిన ఇబ్బందులకు చింతిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రయాణీకులు విమాన రాకపోకలపై ఎప్పటికప్పుడు స్టేటస్‌ని తెలుసుకోవాలని ఆయన సూచించారు. ఫ్లైదుబాయ్‌కి చెందిన అధికార ప్రతినిథి పదుల సంఖ్యలో విమానాలు రద్దు అవడమో, లేటవడమో, లేదంటే ఇతర విమానాశ్రయాలకు డైవర్ట్‌ చేయడమో జరిగిందని చెప్పారు. ఇది ఊహించని పరిస్థితి అనీ, ప్రయాణీకులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రయాణీకుల భద్రతే ముఖ్యమనీ ప్రయాణీకులు అర్థం చేసుకోవాలని కోరారాయన.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com