కొత్త ఆవిష్కరణలకు మన శాస్త్రవేత్తలు నాంది పలకాలి..
- January 03, 2017
ప్రస్తుత సమాజంలో వేగంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనమూ మారాల్సిన ఆవశ్యకత ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తిరుపతిలో జరుగుతున్న 104 జాతీయ సైన్స్ కాంగ్రెస్ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన శాస్త్రవేత్తలు, నోబెల్ బహుమతి గ్రహీతలను సత్కరించారు. .
అనంతరం సదస్సును ఉద్దేశించి మాట్లాడుతూ..
'104వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ సదస్సు ప్రారంభించడం సంతోషంగా ఉంది. శాస్త్ర, సాంకేతిక రంగాలకు మా ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. శాస్త్రవేత్తల సృజనాత్మకత, శక్తి సామర్థ్యాలను దేశం గౌరవిస్తోంది. సవాళ్లను ఎదుర్కొంటూ దీర్ఘకాల ప్రయోజనాల కోసం వారు కృషి చేయాలి.
దేశం గర్వించదగ్గ మరిన్ని కొత్త ఆవిష్కరణలకు మన శాస్త్రవేత్తలు నాంది పలకాలి. వర్శిటీలు, ఐఐటీలు, స్టార్టప్‌లు, మంత్రిత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలి. సమాజ సాధికారితకు శ్రమిస్తున్న శాస్త్రవేత్తలకు దేశం కృతజ్ఞతగా ఉంటుంది.' అని అన్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో సగటు ద్రవ్యోల్బణం 0.94 శాతం..!!
- సౌదీ అరేబియా బ్యాంకింగ్ రంగానికి భారీ మద్దతు..!!
- బహ్రెయిన్‌లో జనవరి 22 నుండి ఆటమ్ ఫెయిర్ 2026..!!
- కువైట్ లో జనవరి 18న పబ్లిక్ హాలీడే..!!
- ఆన్లైన్ టిక్కెట్ల అమ్మకాలపై ఫ్యూయల్‌ఫెస్ట్ హెచ్చరిక..!!
- యూఏఈ స్కూళ్లలో ప్రైడే పని వేళల్లో మార్పులు..!!
- సౌదీలో ఒకే నెలలో 123 కవర్-అప్ కేసులు నమోదు..!!
- 2025లో 2.3% పెరిగిన ఖతార్ జనాభా..!!
- ఒమన్‌లో సోదరి మరణంపై గాయని చిత్ర సంతాపం..!!
- అబుదాబి కారు ప్రమాదం..మరో చిన్నారి మృతి..!!







