ఇకపై నిస్సంకోచంగా డబ్బుల్ని పంపించొచ్చు

- March 06, 2017 , by Maagulf
ఇకపై నిస్సంకోచంగా డబ్బుల్ని పంపించొచ్చు

భారతదేశంలో డిమానిటైజేషన్‌ కారణంగా ఏర్పడ్డ కరెన్సీ సంక్షోభంతో యూఏఈలోనూ ఇండియన్స్‌ పలు సమస్యల్ని ఎదుర్కొన్నారు. తమవారికి డబ్బులు పంపించడానికోసం నానా పాట్లూ పడాల్సి వచ్చింది వారంతా. అయితే నగదు ఉపసంహరణ పరిమితిని సడలించడంతో ఇకపై ఎంత మొత్తమైనాసరే భారతదేశానికి నగదు పంపించుకోవడానికి వీలు కలిగింది. 55,000 ఎక్స్‌ప్రెస్‌ మనీ ఔట్‌లెట్స్‌ ద్వారా ఎవరైనాసరే ఎంతమొత్తమైనా కలెక్ట్‌ చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. నోట్ల రద్దు, నగదు కొరత కారణంగా వినియోగదారులు ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చిందనీ, రిజర్వు బ్యాంకు నిబంధనల్ని సడలించడంతో పరిస్థితి పూర్తిగా మెరుగుపడిందని ఎక్స్‌ప్రెస్‌ మనీ నిర్వాహకులు తెలిపారు. ఫిబ్రవరి 20 నుంచి రిజర్వు బ్యాంకు రోజువారీ నగదు ఉపసంహరణ పరిమితిని 50,000 వరకు పెంచింది. మార్చ్‌ 13తో ఈ పరిమితి పూర్తిగా తొలగిపోనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com