ప్రకాష్‌రాజ్ : నీ కులం ఏంటి అని వాళ్లు అడుగుతున్నారు
- March 07, 2017
స్వతహాగా కన్నడిగుడే అయినప్పటికీ దక్షిణాది వాళ్లందరూ ప్రకాష్‌రాజ్‌ను తమవాడే అనుకుంటారు. దక్షిణాదికి చెందిన అన్ని భాషల్లోనూ అవలీలగా మాట్లాడే ప్రకాష్‌రాజ్ హిందీలో కూడా కొన్ని సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం తమిళనాడులో జరుగబోతున్న ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎలక్షన్స్‌లో వైస్ ప్రెసిడెంట్ పదవికి పోటీ పడుతున్నాడు. ప్రకాష్‌రాజ్ ఇప్పటివరకు దాదాపు 20 సినిమాలను నిర్మించాడు. అయితే నడిగర్ సంఘం ఎన్నికల సమయంలో తెలుగువాడంటూ విశాల్ వివక్షతను ఎదుర్కొన్నట్టే.. ప్రస్తుత ఎన్నికల్లో కన్నడిగుడంటూ ప్రకాష్‌రాజ్ స్థానికతను ప్రశ్నిస్తున్నారు. తన కులం గురించి, ప్రాంతం గురించి, భాష గురించి వారు ప్రశ్నిస్తున్నారంటూ ఈ అసమాన నటుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
ఏదైమైనా వెనక్కి తగ్గేది లేదని, వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికై ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లోని అవినీతిని, నిర్లక్ష్యాన్ని రూపుమాపుతానని అంటున్నాడు ప్రకాష్‌రాజ్.
తాజా వార్తలు
- ఘోర ప్రమాదం.. బస్సులోని 18 మంది ప్రయాణికులు మృతి..
- వాట్సాప్‌లో ఇన్స్టాగ్రామ్ ‘యూజర్ నేమ్’ ఫీచర్..
- ఉచిత బస్సుల పై వెంకయ్య నాయుడు ఫైర్
- మంగళగిరి ఎయిమ్స్ లో త్వరలో ట్రామా సెంటర్: ఎంపీ బాలశౌరి
- అమెరికాలో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా గాంధీజయంతి వేడుకలు
- డా.బంగారి రజనీ ప్రియదర్శినికి టైమ్స్ ఆఫ్ ఇండియా హెల్త్ కేర్ ఐకాన్ అవార్డ్
- ఎస్ఎస్ఆర్ హోటల్స్ కు స్వచ్ఛ ఆంధ్రా అవార్డు..!!
- జ్లీబ్ సమస్యకు వర్కర్స్ సిటీస్ తో చెక్..!!
- BD7,000 విలువైన గోల్డ్ జివెల్లరీ చోరీ..మహిళ అరెస్టు..!!
- కస్టమ్స్ యాప్ ద్వారా కార్లు, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్ వేలం..!!