జనతా గ్యారేజ్' బైక్‌ని సొంతం చేసుకున్న తారక్ అభిమాని
- March 07, 2017
'జనతా గ్యారేజ్' సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నడిపిన బైక్ ను తారక్ అభిమాని రాజ్ కుమార్ రెడ్డి సొంతం చేసుకున్నాడు. 'జనతా గ్యారేజ్' సినిమాలో ఎన్టీఆర్ ఈ బైక్ తో కనిపిస్తాడు. ఈ బైక్ ను చిత్ర నిర్మాతలు మైత్రీ మువీ మేకర్స్ వేలం వేశారు. ఈ వేలంలో నల్గొండ జిల్లాకు చెందిన రాజ్ కుమార్ రెడ్డి 10 లక్షల రూపాయలకు కొనుగోలు చేశాడు.
ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్, ఈ సినిమా దర్శకుడు కొరటాల శివ చేతుల మీదుగా రాజ్ కుమార్ కు బైక్ ను అందజేశారు. ఈ మొత్తాన్ని బసవతారక రామారావు ట్రస్ట్ కు విరాళంగా అందజేయనున్నట్టు మైత్రి మూవీ మేకర్స్ తెలిపారు.
ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు ఎన్టీఆర్.
కళ్యాణ్ రామ్ నిర్మించే ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ మ్యూజిక్ అందిస్తున్నాడు.
తాజా వార్తలు
- ఖతార్ లోని అల్ బలాదియా జంక్షన్ మూసివేత..!!
- జహ్రా నేచర్ రిజర్వ్ నవంబర్ నుండి ఒపెన్..!!
- యూఏఈలో విషాదం.. తండ్రి, 7 నెలల శిశువు మృతి, ICUలో తల్లి..!!
- ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి బహ్రెయిన్, సౌదీ చర్చలు..!!
- ఒమన్, బెలారస్ ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!
- జాతీయ రైతు బజార్ 13వ ఎడిషన్.. అందరికి ఆహ్వానం..!!
- ఘోర ప్రమాదం.. బస్సులోని 18 మంది ప్రయాణికులు మృతి..
- వాట్సాప్‌లో ఇన్స్టాగ్రామ్ ‘యూజర్ నేమ్’ ఫీచర్..
- ఉచిత బస్సుల పై వెంకయ్య నాయుడు ఫైర్
- మంగళగిరి ఎయిమ్స్ లో త్వరలో ట్రామా సెంటర్: ఎంపీ బాలశౌరి